‘సాహో’ కి బాలీవుడ్ కష్టాలు…

ప్రభాస్ ప్రధాన పాత్ర లో తెరకెక్కుతున్న, బాగా ప్రచారంలో ఉన్న సినిమా సాహో. ఈ చిత్రం షూటింగ్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. సినిమా షూటింగ్ దాదాపు గా అయిపోవచ్చిందని అంటున్నారు.

అయితే ఆసక్తికర అంశం ఏంటి అంటే… సినిమా యూనిట్ ఇప్పటి వరకు ఏది ప్లస్ పాయింట్ అవుతుంది అని భావించిందో… అది నెగటివ్ గా మారనుంది.

ముందు నుండి బాలీవుడ్ లో ఈ సినిమా ని ఎక్కువగా ప్రమోట్ చేసుకుంటూ వస్తున్న టీమ్ కావాలనే అందరి కన్నా ముందు ఆగస్టు 15 న విడుదల తేదీ ని ప్రకటించి ఆశ్చర్యపరిచింది.

అది పక్కన పెడితే…. అనుకోకుండా అక్షయ్ కుమార్ తన సినిమా ‘మిషన్ మంగళ్’, జాన్ అబ్రహం ‘బాట్లా హౌస్’ ని కూడా అదే రోజున తీసుకొని వస్తున్నారు. సాహో తప్ప మిగిలిన రెండు సినిమాల కి సంబందించిన ట్రైలర్ బయటకు వచ్చేసింది.

ఇప్పుడు ట్రేడ్ వర్గాలు నమ్మకంగా చెబుతున్నదేమిటంటే…. సాహో మేకింగ్ మీద ఆధారపడింది. కానీ మిగిలిన రెండు సినిమాలు స్ట్రాంగ్ కథల తో వస్తున్నాయి కాబట్టి…. ఏది ఏమైనా సాహో డామినేషన్ ఉండబోదు అని జోస్యం చెబుతున్నారు.

అయితే సాహో టీమ్ కూడా… ఆ రెండు సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే… సాహో సినిమా కి ముప్పు అనే అభిప్రాయం తో ఉన్నారట.