ఈసారి ఇలా ప్లాన్ చేస్తున్నారు !

తెరపై ఎన్నో పాత్రలు పోషించింది ఈ ముద్దుగుమ్మ. కానీ ఈసారి నిజజీవితంలో మరో కొత్త పాత్రలోకి ప్రవేశించబోతోంది. అవును.. హీరోయిన్ గా స్టార్ స్టేటస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు నిర్మాతగా అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతోంది.

రీసెంట్ గా సమంతతో ఓ బేబీ సినిమాను తీసిన నందినీరెడ్డి.. ఆమె కోసం మరో సస్పెన్స్ థ్రిల్లర్ కథ రాసింది. దీనికి సంబంధించి ఇద్దరిమధ్య చర్చలు కూడా పూర్తయ్యాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ సినిమాను సమంత-నాగచైతన్య కలిసి నిర్మించే అవకాశం ఉంది. దీనికోసం వీళ్లు ప్రత్యేకంగా బ్యానర్ కూడా స్థాపించాల్సిన అవసరం లేదు. రెడీగా ఓ బ్యానర్ ఉంది. అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ కు అనుబంధంగా ఇప్పటికే మనం ఎంటర్ ప్రైజస్ అనే కొత్త బ్యానర్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం నాగార్జున నటిస్తున్న మన్మధుడు-2 సినిమాను ఇదే బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడిదే బ్యానర్ పై సమంత-నందినీరెడ్డి రెండో సినిమాను కూడా నిర్మించే ఆలోచనలో ఉన్నారు. తెరపై నిర్మాతలుగా నాగచైతన్య, సమంత పేర్లు వేయబోతున్నారు.