Telugu Global
NEWS

బదనాం చేద్దామని.... బదనాం అయిన టీడీపీ

సున్నా వడ్డీపై రెండో రోజు కూడా అసెంబ్లీలో టీడీపీ బొక్కబోర్లా పడింది. ఇదే అంశంపై టీడీపీ రెండోరోజు వాయిదా తీర్మానం ఇచ్చి చర్చకు పట్టుబట్టింది. టీడీపీ హయాంలో జీరో వడ్డీకి రుణాలు ఇచ్చినట్టు నిరూపిస్తామంటూ టీడీపీ పట్టుబట్టింది. తొలుత స్పీకర్ వాయిదా తీర్మానంపై చర్చకు అంగీకరించలేదు. పైగా నిన్న ముగిసిన అంశంపై మళ్లీ చర్చేంటని ప్రశ్నించారు. టీడీపీ కూడా వాయిదా తీర్మానంపై చర్చకు అనుమతి ఇస్తారని వంద శాతం ఊహించి ఉండదు. కానీ ముఖ్యమంత్రి ఇంతలో లేచి […]

బదనాం చేద్దామని.... బదనాం అయిన టీడీపీ
X

సున్నా వడ్డీపై రెండో రోజు కూడా అసెంబ్లీలో టీడీపీ బొక్కబోర్లా పడింది. ఇదే అంశంపై టీడీపీ రెండోరోజు వాయిదా తీర్మానం ఇచ్చి చర్చకు పట్టుబట్టింది. టీడీపీ హయాంలో జీరో వడ్డీకి రుణాలు ఇచ్చినట్టు నిరూపిస్తామంటూ టీడీపీ పట్టుబట్టింది. తొలుత స్పీకర్ వాయిదా తీర్మానంపై చర్చకు అంగీకరించలేదు. పైగా నిన్న ముగిసిన అంశంపై మళ్లీ చర్చేంటని ప్రశ్నించారు. టీడీపీ కూడా వాయిదా తీర్మానంపై చర్చకు అనుమతి ఇస్తారని వంద శాతం ఊహించి ఉండదు. కానీ ముఖ్యమంత్రి ఇంతలో లేచి ప్రజలకు నిజాలు తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి చర్చకు అనుమతివ్వాలని కోరారు. అందుకు స్పీకర్‌ కూడా అంగీకరించారు.

ఇలా ఊహించని రీతిలో వాయిదా తీర్మానంపై చర్చకు ప్రభుత్వం అంగీకరించడంతో టీడీపీ ఇరుకునపడింది. విచిత్రమైన వాదనను తెరపైకి తెచ్చారు టీడీపీ సభ్యులు. జగన్ మోహన్ రెడ్డి టీడీపీ హయాంలో జీరో వడ్డీ కోసం దమ్మిడి కూడా కేటాయించలేదన్నారు… కానీ అబద్దం… టీడీపీ హయాంలో జీరో వడ్డీ కోసం రూపాయి చెల్లించి ఉండవచ్చు… రెండు రూపాయలు చెల్లించి ఉండవచ్చు… కాబట్టి చిల్లిగవ్వ కూడా కేటాయించలేదని ముఖ్యమంత్రి చెప్పిన మాటల్లో వాస్తవం లేదంటూ అచ్చెన్నాయుడు వాదించారు.

ఆ తర్వాత అందుకున్న చంద్రబాబు… తాము జీరో వడ్డీ పథకానికి నిధులు కేటాయించాం.. అందుకు ప్రభుత్వ డాక్యుమెంట్లే నిదర్శనమంటూ కాసేపు వాదించారు. అయితే చివరకు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి తీసిన అసలు లెక్కల ముందు రెండో రోజు కూడా టీడీపీ తేలిపోయింది.

ఐదేళ్లలో రైతులకు జీరో వడ్డీ పథకం వర్తించాలంటే బ్యాంకులకు ప్రభుత్వం 11వేల 60 కోట్లు చెల్లించాల్సి ఉండగా… చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లలో కలిసి కేవలం 630 కోట్లు మాత్రమే కేటాయించిందన్నారు. అంటే చెల్లించాల్సిన మొత్తంలో ఐదు శాతం ఇచ్చి… సున్నా వడ్డీకే రుణాలిచ్చామని ఎలా చెబుతున్నారని చంద్రబాబును ప్రశ్నించారు. చెల్లించాల్సిన మొత్తంలో ఐదు శాతం డబ్బు చెల్లించి … జీవో వడ్డీ పథకాన్ని అమలు చేశాం అని చెప్పడం సరైనదేమో చంద్రబాబే చెప్పాలని జగన్ ప్రశ్నించారు.

వాడుక భాష తరహాలో తాను టీడీపీ హయాంలో చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదని విమర్శిస్తే… టీడీపీ మాత్రం రూపాయి ఇచ్చాం, రెండు రూపాయలు ఇచ్చాం కదా అని వాదించడం బట్టి టీడీపీ ఏ స్థాయికి చేరుకుందో అర్థం చేసుకోవచ్చన్నారు జగన్‌.

తాము సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేశాం… దాన్ని అసెంబ్లీలో నిరూపించేందుకు రెండోరోజు వాయిదా తీర్మానం ఇస్తే దాన్ని అంగీకరించకుండా ప్రభుత్వం పారిపోయింది అని ప్రచారం చేసుకోవాలని టీడీపీ భావించి ఉండవచ్చు. కానీ అసాధారణ రీతిలో వాయిదా తీర్మానంపై చర్చకు జగన్‌ మోహన్ రెడ్డి అంగీకరించడంతో టీడీపీ ప్లాన్ తలకిందులైనట్టుగా ఉంది. సున్నా వడ్డీ పథకానికి ఇవ్వాల్సిన సొమ్ములో కేవలం ఐదు శాతం మాత్రమే ఇచ్చి టీడీపీ బిల్డప్ ఇచ్చిందన్న అంశం రెండో రోజు సభలో ప్రజలకు మరింత బాగా అర్థమైపోయింది.

First Published:  12 July 2019 12:05 PM GMT
Next Story