Telugu Global
Cinema & Entertainment

రాజు గారి గది-3 లో... రష్మి

‘రాజు గారి గది’ సినిమాతో మంచి విజయాన్ని సాధించిన దర్శకుడు ఓంకార్ ‘రాజు గారి గది 2’ సినిమా తో మాత్రం నాగార్జున, సమంత వంటి పెద్ద స్టార్లు ఉన్నప్పటికీ ప్రేక్షకులను అనుకున్నంతగా మెప్పించలేకపోయాడు. తాజాగా ఓంకార్ ఇప్పుడు ‘రాజుగారిగది 3’ సినిమా తీయడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రంలో ఎవరు నటించనున్నారు? అనే విషయంపై గత కొంత కాలంగా సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఇప్పటికే ముందుగా ఈ సినిమా కోసం తమన్నా ని ఓకే చేశారు… […]

రాజు గారి గది-3 లో... రష్మి
X

‘రాజు గారి గది’ సినిమాతో మంచి విజయాన్ని సాధించిన దర్శకుడు ఓంకార్ ‘రాజు గారి గది 2’ సినిమా తో మాత్రం నాగార్జున, సమంత వంటి పెద్ద స్టార్లు ఉన్నప్పటికీ ప్రేక్షకులను అనుకున్నంతగా మెప్పించలేకపోయాడు.

తాజాగా ఓంకార్ ఇప్పుడు ‘రాజుగారిగది 3’ సినిమా తీయడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రంలో ఎవరు నటించనున్నారు? అనే విషయంపై గత కొంత కాలంగా సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.

ఇప్పటికే ముందుగా ఈ సినిమా కోసం తమన్నా ని ఓకే చేశారు… కానీ మిల్కీ బ్యూటీ మాత్రం సినిమా నుండి తప్పుకుంది. తాప్సీని అనుకున్నారు…. అదీ వర్కవుట్ కాలేదు… దీంతో మళ్లీ పెద్ద హీరోయిన్ కోసం వెతుకడం లో బిజీ అయ్యాడు ఓంకార్.

ఈ సినిమాలు మెయిన్ హీరోయిన్ పాత్ర కోసం మాత్రం ఓంకార్ స్టార్ హీరోయిన్ ని మాత్రమే ఎంపిక చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ సినిమాలో ఒక కీలకపాత్ర పోషించడానికి మాత్రం ఒక ప్రముఖ యాంకర్ ని సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఆమె ఎవరో కాదు రష్మి గౌతమ్.

ఇప్పటికే పలు హారర్ కామెడీ సినిమాల్లో నటించిన అనుభవం ఉన్న రష్మీ ని ‘రాజుగారిగది 3’ సినిమాలో ఒక ముఖ్య పాత్ర కోసం అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి ఈ మూడవ రాజుగారిగది అయినా ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో చూడాలి.

First Published:  13 July 2019 2:17 AM GMT
Next Story