Telugu Global
National

బిగ్‌బాస్‌ సెక్స్ రాకెట్‌... 100 రోజులు సెక్స్ లేకుండా ఎలా? అంటూ ప్రశ్న

నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించబోతున్న బిగ్‌బాస్-3పై వివాదాలు అలముకుంటున్నాయి. బిగ్‌బాస్ హౌజ్‌ మేట్స్‌ను ఎంపిక చేయడంలో నిర్వాహకులు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు తీవ్రస్థాయిలో వస్తున్నాయి. ప్రముఖ జర్నలిస్ట్ శ్వేతా రెడ్డి మీడియా ముందుకు వచ్చి తనకు ఎదురైన అనుభవాలను వివరించడంతో బిగ్‌బాస్ షో గుట్టు రట్టయింది. ఫీమేల్ హౌస్‌మేట్స్‌కు పలు లైంగిక సంబంధమైన ప్రశ్నలు అడుగుతున్నారు. బిగ్ బాస్‌ను ఎలా సంతృప్తి పరుస్తావ్‌?, హౌస్‌లో ఎఫైర్లు పెట్టుకునేందుకు సిద్ధమా?, ఎవరైనా ముద్దులు పెట్టినా పెట్టించుకుంటారా?…వంటి అసహజ ప్రశ్నలు […]

బిగ్‌బాస్‌ సెక్స్ రాకెట్‌... 100 రోజులు సెక్స్ లేకుండా ఎలా? అంటూ ప్రశ్న
X

నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించబోతున్న బిగ్‌బాస్-3పై వివాదాలు అలముకుంటున్నాయి. బిగ్‌బాస్ హౌజ్‌ మేట్స్‌ను ఎంపిక చేయడంలో నిర్వాహకులు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు తీవ్రస్థాయిలో వస్తున్నాయి.

ప్రముఖ జర్నలిస్ట్ శ్వేతా రెడ్డి మీడియా ముందుకు వచ్చి తనకు ఎదురైన అనుభవాలను వివరించడంతో బిగ్‌బాస్ షో గుట్టు రట్టయింది. ఫీమేల్ హౌస్‌మేట్స్‌కు పలు లైంగిక సంబంధమైన ప్రశ్నలు అడుగుతున్నారు. బిగ్ బాస్‌ను ఎలా సంతృప్తి పరుస్తావ్‌?, హౌస్‌లో ఎఫైర్లు పెట్టుకునేందుకు సిద్ధమా?, ఎవరైనా ముద్దులు పెట్టినా పెట్టించుకుంటారా?…వంటి అసహజ ప్రశ్నలు వేస్తూ నిర్వాహకులు ఇంటర్వ్యూలు చేశారు. వీటిని అంగీకరించని వారిని ఎంపిక చేయకుండా తిరస్కరిస్తున్నారు.

తాజాగా గాయత్రి గుప్తాకు ఇదే తరహా అనుభవం ఎదురైంది. ఆమెను కూడా బిగ్ బాస్ హౌస్‌కు ఎంపిక చేశామని చెప్పిన నిర్వాహకులు ఇదే తరహాలో ప్రశ్నలు వేశారు. ఆ తర్వాత ఆమెను జాబితా నుంచి తొలగించారు. 100 రోజులు బిగ్ బాస్ హౌస్‌లో ఉంటారు కదా… అన్ని రోజులు సెక్స్‌ లేకుండా ఎలా మేనేజ్ చేసుకుంటావ్‌ అని తనను బిగ్ బాస్ నిర్వాహకులు ప్రశ్నించారని గాయత్రి గుప్తా మీడియా ముందు వివరించారు. ఇలా నీచమైన ప్రశ్నలతో అమ్మాయిలను వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు.

First Published:  12 July 2019 11:54 PM GMT
Next Story