Telugu Global
Cinema & Entertainment

సినిమాలకు దూరంగా కొన్నాళ్లు....

కెరీర్ మొదట్లో ‘అందాల రాక్షసి’, ‘భలే భలే మగాడివోయ్’ వంటి హిట్ సినిమాలలో నటించిన లావణ్య త్రిపాటి గత కొంతకాలంగా నటించిన ప్రతి సినిమా ఫ్లాప్ అవుతూనే వస్తోంది. ప్రస్తుతం తన ఆశలన్నీ ‘అర్జున్ సురవరం’ పైనే పెట్టుకుంది. తమిళ సినిమా ‘కణితన్’ కి రీమేక్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో నిఖిల్ హీరోగా నటిస్తున్నాడు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదలైన తర్వాత లావణ్య త్రిపాఠీ కొంతకాలం ఇండస్ట్రీ నుంచి […]

సినిమాలకు దూరంగా కొన్నాళ్లు....
X

కెరీర్ మొదట్లో ‘అందాల రాక్షసి’, ‘భలే భలే మగాడివోయ్’ వంటి హిట్ సినిమాలలో నటించిన లావణ్య త్రిపాటి గత కొంతకాలంగా నటించిన ప్రతి సినిమా ఫ్లాప్ అవుతూనే వస్తోంది.

ప్రస్తుతం తన ఆశలన్నీ ‘అర్జున్ సురవరం’ పైనే పెట్టుకుంది. తమిళ సినిమా ‘కణితన్’ కి రీమేక్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో నిఖిల్ హీరోగా నటిస్తున్నాడు.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదలైన తర్వాత లావణ్య త్రిపాఠీ కొంతకాలం ఇండస్ట్రీ నుంచి బ్రేక్ తీసుకునే ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తనని తాను రీ డిస్కవర్ చేసుకోవడానికి మరియు ఎలాంటి కథలు తనకు సెట్ అవుతాయో అనే విషయంపై ఒక అవగాహన తెచ్చుకోవడం కోసం కొన్నాళ్లు సినిమాలకు దూరం అవుదామని లావణ్య త్రిపాటి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

వరుసగా ఆఫర్స్ వస్తున్నప్పటికీ… తనకు సూటయ్యే పాత్రల్లో నటించాలని అనుకుంటోందట. అయితే ఈలోపు తాను లాటిన్ డాన్స్ కూడా నేర్చుకుంటున్నట్లు తెలిపింది. ఇప్పటికే తాను లాటిన్ డాన్స్ క్లాస్ లో జాయిన్ అయినట్లు చెప్పింది లావణ్య త్రిపాటి. తాను ఒక ట్రైన్డ్ భరతనాట్యం డ్యాన్సర్ అని, వేరే డ్యాన్స్ కూడా నేర్చుకోవడం బాగుంటుంది కాబట్టి కమర్షియల్ మరియు సాల్సా కలిపినట్లు ఉండే లాటిన్ డాన్స్ నేర్చుకుంటున్నట్లు చెప్పింది లావణ్య త్రిపాటి.

First Published:  13 July 2019 5:00 AM GMT
Next Story