Telugu Global
Cinema & Entertainment

ఆరునెలల్లో తీసేశారు... కానీ విడుదలవ్వడానికి మూడేళ్ళు పట్టింది...

సౌత్ ఇండస్ట్రీ లో ప్రముఖ దర్శకులలో గౌతమ్ మీనన్ కూడా ఒకరు. ‘కాక్క కాక్క’, ‘రాఘవన్’ వంటి ఎన్నో సూపర్ హిట్ లను అందించిన గౌతమ్ మీనన్ గత కొంతకాలంగా ఫెయిల్యూర్స్ లో ఉన్నాడు. గౌతమ్ దర్శకత్వం వహించిన సినిమాలు విడుదలకు కూడా నోచుకోని పరిస్థితి ఏర్పడింది. గౌతం మీనన్ నిర్మాతగా వ్యవహరించిన సినిమాలు కూడా ఫైనాన్సియర్స్ గొడవల వల్ల ఆగిపోయాయి. అయితే తాజా సమాచారం ప్రకారం గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఒక సినిమా మళ్లీ […]

ఆరునెలల్లో తీసేశారు... కానీ విడుదలవ్వడానికి మూడేళ్ళు పట్టింది...
X

సౌత్ ఇండస్ట్రీ లో ప్రముఖ దర్శకులలో గౌతమ్ మీనన్ కూడా ఒకరు. ‘కాక్క కాక్క’, ‘రాఘవన్’ వంటి ఎన్నో సూపర్ హిట్ లను అందించిన గౌతమ్ మీనన్ గత కొంతకాలంగా ఫెయిల్యూర్స్ లో ఉన్నాడు.

గౌతమ్ దర్శకత్వం వహించిన సినిమాలు విడుదలకు కూడా నోచుకోని పరిస్థితి ఏర్పడింది. గౌతం మీనన్ నిర్మాతగా వ్యవహరించిన సినిమాలు కూడా ఫైనాన్సియర్స్ గొడవల వల్ల ఆగిపోయాయి. అయితే తాజా సమాచారం ప్రకారం గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఒక సినిమా మళ్లీ ఇన్నాళ్లకు విడుదల కాబోతోందట. అదే ధనుష్ హీరోగా నటించిన ‘ఎన్నై నొక్కి పాయుమ్ తోటా’.

ధనుష్-గౌతమ్ మీనన్ కాంబినేషన్ లో సినిమా అంటే అప్పట్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆరునెలల్లోనే సినిమా షూటింగ్ పూర్తి కూడా చేసేసాడు గౌతమ్ మీనన్. కానీ ఆ సినిమా మాత్రం విడుదలకు నోచుకోలేదు. అలా మూడేళ్లు గడిచిపోయాయి. అయితే ఇన్నాళ్ళకు ఫైనాన్సియర్స్ తో గొడవలు సెటిల్ చేసుకొని సినిమా విడుదల చేయబోతున్నారు.

నిజానికి ‘లై’ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా మారిన మేఘ ఆకాష్ ఈ సినిమాతోనే ఇండస్ట్రీకి పరిచయం కావాల్సింది…. కానీ వేరే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ‘డియర్ కామ్రేడ్స్’ సినిమాతో పాటు జూలై 26న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి ఈ సినిమాతో గౌతమ్ మీనన్ ప్రేక్షకులను మెప్పిస్తారో లేదో చూడాలి.

First Published:  13 July 2019 3:16 AM GMT
Next Story