Telugu Global
National

కిషన్‌ రెడ్డి సెక్రెటరీగా ఆమ్రపాలి

తెలంగాణకు చెందిన ఐఏఎస్‌ ఆఫీసర్, ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్‌ ఆమ్రపాలి కీలక బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఆమెను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డికి ప్రైవేట్ సెక్రటరీగా కేంద్రం ఆమోదించింది. పలువురు అధికారులు ఈ పోస్టు కోసం పోటీ పడ్డా కూడా ఆమ్రపాలి సమర్థత ఆధారంగా ఆమె వైపే కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపింది. అయితే ఆమె కేంద్రానికి వెళ్లాలంటే తెలంగాణ ప్రభుత్వం నో ఆబ్జెక్షన్‌ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే […]

కిషన్‌ రెడ్డి సెక్రెటరీగా ఆమ్రపాలి
X

తెలంగాణకు చెందిన ఐఏఎస్‌ ఆఫీసర్, ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్‌ ఆమ్రపాలి కీలక బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఆమెను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డికి ప్రైవేట్ సెక్రటరీగా కేంద్రం ఆమోదించింది. పలువురు అధికారులు ఈ పోస్టు కోసం పోటీ పడ్డా కూడా ఆమ్రపాలి సమర్థత ఆధారంగా ఆమె వైపే కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపింది. అయితే ఆమె కేంద్రానికి వెళ్లాలంటే తెలంగాణ ప్రభుత్వం నో ఆబ్జెక్షన్‌ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే ఆమె ఢిల్లీకి వెళ్లగలుగుతారు.

ఆమ్రపాలి కాశ్మీర్‌కు చెందిన ఐపీఎస్‌ ఆఫీసర్ సమీర్ శర్మను గతేడాది వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం సమీర్ శర్మ కూడా ఢిల్లీలోనే విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమ్రపాలి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి వద్ద సెక్రటరీగా పోస్టులో చేరితో ఆమె కేరీర్‌ మరింత ఉన్నత స్థాయికి చేరినట్టు అవుతుంది.

అయితే తెలంగాణకు చెందిన కొందరు అధికారులు ఏపీకి వెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించినా… వారి ఫైళ్లను కేంద్ర హోంశాఖ పెండింగ్‌లో ఉంచింది. ఇప్పుడు ఆ ఫైళ్లను కేంద్రం ఓకే చేస్తుందా లేదా అన్నది కూడా చూడాలి.

First Published:  12 July 2019 11:52 PM GMT
Next Story