వింబుల్డన్ ఫైనల్లో 11వసారి సెరెనా

  • 24వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కు సెరెనా గురి
  • ఫైనల్లో సిమోనా హాలెప్ తో సెరెనా ఢీ

అమెరికన్ బ్లాక్ థండర్ సెరెనా విలియమ్స్…వింబుల్డన్ టెన్నిస్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్ కు 11వసారి చేరుకొంది. శనివారం జరిగే టైటిల్ సమరంలో రుమేనియన్ వండర్ సిమోనా హాలెప్ తో తలపడనుంది.

వింబుల్డన్ లోని ఆల్ ఇంగ్లండ్ క్లబ్ సెంటర్ కోర్టులో ముగిసిన రెండో సెమీఫైనల్లో 11వ సీడ్ సెరెనా వరుస సెట్లలో చెక్ ప్లేయర్ బార్బరా స్ట్రికోవాను 6-1, 6-2తో చిత్తు చేసింది. తన సుదీర్ఘ కెరియర్ లో 11వసారి వింబుల్డన్ ఫైనల్స్ కు అర్హత సంపాదించింది.

ఇప్పటికే ఏడుసార్లు వింబుల్డన్ సింగిల్స్ విజేతగా నిలిచిన సెరెనా…మరో టైటిల్ నెగ్గితే మొత్తం 24 టైటిల్స్ తో…ఆస్ట్రేలియన్ ఆల్ టైమ్ గ్రేట్ మార్గారెట్ కోర్ట్ రికార్డును సమం చేయగలుగుతుంది.

మరికొద్ది గంటల్లో జరిగే టైటిల్ సమరంలో ప్రపంచ మాజీ నంబర్ వన్ , రుమేనియా స్టార్ ప్లేయర్ సిమోనా హాలెప్ తో అమీతుమీ తేల్చుకోనుంది.