Telugu Global
NEWS

చర్చల్లో చేతులెత్తేస్తున్న వైసీపీ ప్రతినిధులు

ప్రతిపక్షంలో ఉన్నప్పటితో పోలిస్తే అధికారంలోకి వచ్చిన తర్వాతే వైసీపీలోని కొన్ని విభాగాలను నిరుత్సాహం, నిర్లక్ష్యం బాగా ఆవరించినట్టుగా కనిపిస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సమర్థవంతంగా ఎదురుదాడి చేసిన కొన్ని వైసీపీ విభాగాలు, నేతలు ఇప్పుడు చప్పుడు తగ్గించారు. టీవీ చర్చల్లో కీలకమైన, ధాటైన గొంతులు ఎక్కువగా వైసీపీ తరపున వినిపించడం లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధీటుగా మాట్లాడిన వారి కంటే మౌనంగా ఉన్న వారికే పదవుల్లో ప్రాధాన్యత లభించిందన్న భావనో లేక అధికార ప్రతినిధులుగా ఉన్నా తమకు ఏ […]

చర్చల్లో చేతులెత్తేస్తున్న వైసీపీ ప్రతినిధులు
X

ప్రతిపక్షంలో ఉన్నప్పటితో పోలిస్తే అధికారంలోకి వచ్చిన తర్వాతే వైసీపీలోని కొన్ని విభాగాలను నిరుత్సాహం, నిర్లక్ష్యం బాగా ఆవరించినట్టుగా కనిపిస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సమర్థవంతంగా ఎదురుదాడి చేసిన కొన్ని వైసీపీ విభాగాలు, నేతలు ఇప్పుడు చప్పుడు తగ్గించారు. టీవీ చర్చల్లో కీలకమైన, ధాటైన గొంతులు ఎక్కువగా వైసీపీ తరపున వినిపించడం లేదు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధీటుగా మాట్లాడిన వారి కంటే మౌనంగా ఉన్న వారికే పదవుల్లో ప్రాధాన్యత లభించిందన్న భావనో లేక అధికార ప్రతినిధులుగా ఉన్నా తమకు ఏ పదవి రాలేదన్న బాధో…. లేదంటే అధికారంలోకి వచ్చాం కదా ఇక పార్టీ వాయిస్‌ను ప్రత్యేకంగా వినిపించాల్సిన అవసరం లేదని ఆ పార్టీనే భావించిందో ఏమో గానీ చర్చల్లో వైసీపీ ధాటి తగ్గిపోయింది.

బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత వివిధ చానళ్లు నిర్వహించిన చర్చ కార్యక్రమాల్లో వైసీపీ ప్రభుత్వ వాదన తేలిపోయినట్టు కనిపించింది. సబ్జెట్‌ ఉన్న వారు కాకుండా మమ అనిపించే నేతలే చర్చల్లో పాల్గొన్నారు. ప్రత్యర్థి పార్టీ నుంచి బలమైన వారు చర్చలకు వచ్చారు. దాంతో బడ్జెట్‌పై లేవనెత్తిన అనుమానాలకు వైసీపీ నేతలు సరైన సమాధానం ఇవ్వలేక బెబ్బెబ్బా అనేశారు.

ఏకంగా 2 లక్షల 27వేల కోట్ల బడ్జెట్‌ పెట్టారు కదా అంత సొమ్ము ఎక్కడి నుంచి వస్తుంది అన్న ప్రాథమిక ప్రశ్నకు కూడా వైసీపీ తరపున చర్చల్లో పాల్గొన్న వారు సమాధానం ఇవ్వలేకపోయారు. గత ప్రభుత్వం చూపెట్టిన అభివృద్ధి గణాంకాలను అసత్యాలన్నారు… మరి హఠాత్తుగా ఏకంగా 2లక్షల 27వేల కోట్లతో బడ్జెట్‌ ఎలా పెట్టారు అన్న ప్రశ్నకు కూడా వైసీపీ ప్రతినిధులు సమాధానం చెప్పలేకపోయారు.

ఇక్కడ చర్చలకు వచ్చిన వైసీపీ ప్రతినిధుల కంటే… ఈ పరిస్థితికి ఆ పార్టీని, సంబంధిత మంత్రిని, ముఖ్యమంత్రినే తప్పుపట్టాలేమో. బడ్జెట్‌ ప్రవేశపెట్టి చేతులు దులుపుకోవడం కాకుండా ఆర్థిక మంత్రి ఓ పది నిమిషాలైనా మీడియా ముందుకు వచ్చి పలు ప్రశ్నలకు స్పష్టత ఇచ్చి ఉంటే వైసీపీ ప్రతినిధులకు చర్చల్లో చెమటలు తప్పి ఉండేవి. సరైన సమాచారం లేకపోవడంతో చర్చల్లో వైసీపీ ప్రతినిధులు ఇబ్బండిపడ్డారు.

ఒక్క బడ్జెట్ అంశంలోనే కాకుండా ఇతర అంశాల్లో వైసీపీ వాయిస్‌ గతంలో పోలిస్తే తగ్గిందనిపిస్తోంది. సోషల్ మీడియాలో కూడా ఆ పార్టీ ఊపు ఇదివరకటి తరహాలో లేదు. మనకెందుకులే బాధ అన్న ధోరణి ఆ పార్టీ వ్యక్తులు, విభాగాల్లో పెరుగుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది.

First Published:  13 July 2019 12:15 AM GMT
Next Story