నేను బాగున్నా… పుకార్లు నమ్మొద్దు

దర్శకుడు పోసాని కృష్ణ మురళీ తన ఆరోగ్యంపై జరుగుతున్న ప్రచారంపై స్పందించారు. తాను అనారోగ్యానికి గురైంది వాస్తవమేనని… కానీ ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని వెల్లడించారు.

మరో వారం పదిరోజుల్లోనే షూటింగ్‌కు వెళ్తున్నట్టు వివరించారు. చికిత్స అనంతరం మరోసారి పోసాని అనారోగ్యానికి గురయ్యారని ప్రచారం జరిగింది.

దీంతో స్పందించిన పోసాని… మరోసారి తాను అస్వస్థతకు గురైనట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. తన ఆరోగ్యంపై ఇక ఎలాంటి చర్చ వద్దని సూచించారు.

తాను త్వరగా కోలుకోవాలని ఆశించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెబుతూ ఒక వీడియోను విడుదల చేశారు పోసాని.