Telugu Global
Cinema & Entertainment

నెటిజన్ నోరు.... ఇలా మూయించింది

చాలా మంది సెలబ్రిటీలు…. సోషల్ మీడియాలో ట్రోల్ చేసేవాళ్ళను పట్టించుకోరు. కానీ కొన్ని కొన్ని సార్లు ట్రోలర్లు మితిమీరి పోతుంటే మాత్రం సెలబ్రిటీలు వారికి చెక్ పెట్టాల్సిన అవసరం ఏర్పడుతుంది. #iSmartShankarTrailer2 https://t.co/DIxY4noCGu@ramsayz @purijagan @Charmmeofficial @AgerwalNidhhi @NabhaNatesh @ActorSatyaDev #PCFilm @PuriConnects @IamVishuReddy#iSmartShankarOnJuly18th — Nidhhi Agerwal (@AgerwalNidhhi) July 13, 2019 అలాంటి అవసరమే నిధి అగర్వాల్ కి కూడా ఏర్పడింది. నాగచైతన్య హీరోగా నటించిన ‘సవ్యసాచి’ సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు […]

నెటిజన్ నోరు.... ఇలా మూయించింది
X

చాలా మంది సెలబ్రిటీలు…. సోషల్ మీడియాలో ట్రోల్ చేసేవాళ్ళను పట్టించుకోరు. కానీ కొన్ని కొన్ని సార్లు ట్రోలర్లు మితిమీరి పోతుంటే మాత్రం సెలబ్రిటీలు వారికి చెక్ పెట్టాల్సిన అవసరం ఏర్పడుతుంది.

అలాంటి అవసరమే నిధి అగర్వాల్ కి కూడా ఏర్పడింది. నాగచైతన్య హీరోగా నటించిన ‘సవ్యసాచి’ సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నిధి అగర్వాల్…. రెండవ సినిమాగా అక్కినేని అఖిల్ తో ‘మిస్టర్ మజ్ను’ సినిమాలో నటించింది. కానీ మొదటి రెండు సినిమాలు ఆమె కి చేదు అనుభవాలనే మిగిల్చాయి. ఇక ఈమె త్వరలో రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రాబోతున్న ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో హీరోయిన్ పాత్ర పోషిస్తోంది.

ఈ మధ్యనే ఈ చిత్ర రెండవ ట్రైలర్ ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. మొదటి ట్రైలర్ కంటే రెండవ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ ట్రైలర్ ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది నిధి అగర్వాల్.

పోస్ట్ కింద ఒక నెటీజన్ “ఎక్స్ పోజింగ్ కాకుండా ఇంకా ఏమైనా చేసావా ఈ సినిమాలో?” అంటూ కామెంట్ చేశాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన నిధి అగర్వాల్ అతడి నోరు మూయించే విధంగా రిప్లై ఇచ్చింది.

“యాక్చ్యువల్లీ, చాలా చేశాను. ట్రైలర్ కాదు మూవీ చూడు” అంటూ రిప్లై ఇచ్చింది నిధి అగర్వాల్. దీంతో ఆ నెటీజన్ కూడా సైలెంట్ అయిపోయాడు. ఇక ఈ సినిమా ఈ నెల 18 వ తారీఖున విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.

First Published:  13 July 2019 11:07 PM GMT
Next Story