నిర్మాతగా క్లిక్ అయ్యాడు.. హీరోగా ఫెయిల్

చాన్నాళ్ల తర్వాత సందీప్ కిషన్ మరోసారి వార్తల్లో వ్యక్తిగా మారాడు. దానికి కారణం అతడు నటించిన ‘నిను వీడని నీడను నేనే ‘సినిమా. ఆ సినిమా ఈ హీరోకు మిక్స్ డ్ రిజల్ట్ తెచ్చిపెట్టింది. అలా అని సినిమాకు మిక్స్ డ్ రిజల్ట్ వచ్చిందని కాదు. నిర్మాతగా సందీప్ కిషన్ హిట్ అయ్యాడు, హీరోగా మరోసారి ఫెయిల్ అయ్యాడు.

అవును.. తొలిసారి నిర్మాతగా మారి సందీప్ కిషన్ తీసిన ‘నిను వీడని నీడను నేనే’ సినిమా కంటెంట్ పరంగా విమర్శలు ఎదుర్కొంటోంది. అందరూ దీనికి యావరేజ్ మార్కులే వేస్తున్నారు. హీరోగా సందీప్ కిషన్ యాక్టింగ్ కు కూడా పెద్దగా మార్కులు పడలేదు. అలా యావరేజ్ గా నడుస్తోంది ‘నినువీడని నీడను నేనే సినిమా’.

అదే సమయంలో నిర్మాతగా మాత్రం ఈ హీరో క్లిక్ అయ్యాడు. ట్రయిలర్ క్లిక్ అవ్వడంతో ‘నిను వీడని నీడను నేనే’ సినిమా కాస్త మంచి రేటుకే అమ్ముడుపోయింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను 4 కోట్ల రేషియోలో అమ్మారు. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం చూసుకుంటే.. ఈ సినిమా మరో 2 రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయిపోవడం గ్యారెంటీ.

దీంతో సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చినా, నిర్మాతగా సందీప్ కిషన్ ఫుల్ హ్యాపీ. మరోవైపు ప్రచారాన్ని మాత్రం ఆపలేదు సందీప్ కిషన్. ఇప్పటికే మెట్రో రైళ్లలో ప్రయాణం చేసిన ఈ హీరో, రేపట్నుంచి తెలుగు రాష్ట్రాల్లో పర్యటించబోతున్నాడు.