రవితేజ సరసన అదితిరావు

ఎన్ని సినిమాలు చేశామన్నది కాదు, మనసుకు నచ్చిన సినిమాలు చేశామా లేదా అనేది అదితి రావు కాన్సెప్ట్. అందుకే ఆమె అన్ని సినిమాలు ఒప్పుకోదు. తనకు బాగా నచ్చిన కథలకే గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. అలాంటి ఓ కథ ఇప్పుడు అదితి రావు చెంతకు చేరింది. దాని పేరు మహాసముద్రం.

ఈ టైటిల్ ఎక్కడో విన్నట్టుంది కదా. మీ ఊహ నిజమే. ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి రాసుకున్న కథ ఇది. ఇందులో హీరోగా నాగచైతన్యను అనుకున్నాడు. కానీ వర్కవుట్ కాలేదు. ఆ వెంటనే రవితేజకు కథ వినిపించడం, ఆయన అంగీకరించడం చకచకా జరిగిపోయాయి. ఈ సినిమాలోనే హీరోయిన్ గా అదితి రావును తీసుకునే ఆలోచనలో ఉన్నారు.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి కథ, హీరో, హీరోయిన్ అంతా సిద్ధంగా ఉంది. కానీ నిర్మాత ఎవరనేది తేలడం లేదు. కాస్త భారీ బడ్జెట్ తో చేయాల్సిన సినిమా ఇది. అటు చూస్తే రవితేజ మార్కెట్ అంతంతమాత్రంగానే ఉంది. అందుకే అంత బడ్జెట్ పెట్టే నిర్మాత దొరకడం లేదు. ఈ సినిమా కోసం ప్రస్తుతానికి 40 కోట్ల రూపాయల బడ్జెట్ అనుకుంటున్నారు.