సమంత సినిమాకి…. నాగచైతన్య రికమండేషన్

తాజాగా విడుదలైన ‘ఓ… బేబీ’ సినిమాతో సమంత అక్కినేని మరొక సూపర్ హిట్ ను అందుకుంది. నందిని రెడ్డి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈచిత్రం ప్రస్తుతం బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.

ఇంతకుముందు ‘స్వామిరారా’, ‘దోచేయ్’, ‘కొత్తజంట’ వంటి సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన రిచర్డ్ ప్రసాద్ ఈ సినిమాకి కూడా సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న రిచర్డ్ ప్రసాద్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ అసలు ఈ సినిమాలో తనకు అవకాశం రావడానికి గల కారణం నాగచైతన్య అని చెప్పుకొచ్చాడు.

ఈ సినిమా కోసం రిచర్డ్ ప్రసాద్ పేరుని నాగచైతన్య స్వయంగా రికమెండ్ చేశాడట. అయితే ఈ సినిమాలో తన పనితనం చూసి బాగా మెచ్చిన నందిని రెడ్డి తన తదుపరి సినిమాలో కూడా రిచర్డ్ ప్రసాద్ కి అవకాశం ఇస్తానని మాట ఇచ్చిందట.

‘ఓ… బేబీ’ సక్సెస్ తరువాత…. నందిని రెడ్డి తన తదుపరి సినిమాలో కూడా సమంతానే హీరోయిన్ గా తీసుకోబోతున్నట్టు వినికిడి. సినిమా కోసం ఒక క్రైమ్ థ్రిల్లర్ కథను కూడా నందిని రెడ్డి సిద్ధం చేసుకుందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.