Telugu Global
NEWS

కియో మోటార్స్ రావడానికి కారణం వైఎస్సే- కియో ప్రెసిడెంట్

అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన కియో మోటార్స్ క్రెడిట్‌పై చాలా కాలంగా చర్చ జరిగింది. మోడీ వల్లే పరిశ్రమ వచ్చిందని బీజేపీ, లేదు చంద్రబాబు వల్లే వచ్చిందని టీడీపీ ప్రచారం చేసుకున్నాయి. అయితే కంపెనీ ప్రెసిడెంట్ అండ్ సీఈవో మాత్రం మరోలా స్పందించారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఎన్నికల్లో ఘన విజయం తర్వాత కియో మోటార్స్ ప్రెసిడెంట్‌ అండ్ సీఈవో … ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి […]

కియో మోటార్స్ రావడానికి కారణం వైఎస్సే- కియో ప్రెసిడెంట్
X

అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన కియో మోటార్స్ క్రెడిట్‌పై చాలా కాలంగా చర్చ జరిగింది. మోడీ వల్లే పరిశ్రమ వచ్చిందని బీజేపీ, లేదు చంద్రబాబు వల్లే వచ్చిందని టీడీపీ ప్రచారం చేసుకున్నాయి. అయితే కంపెనీ ప్రెసిడెంట్ అండ్ సీఈవో మాత్రం మరోలా స్పందించారు.

ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఎన్నికల్లో ఘన విజయం తర్వాత కియో మోటార్స్ ప్రెసిడెంట్‌ అండ్ సీఈవో … ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఒక లేఖ రాశారు. ఆ లేఖలోని వివరాలను బుగ్గన అసెంబ్లీలో చదివి వినిపించారు.

అనంతపురం జిల్లాలో కియో మోటార్స్ ఏర్పాటు ఆలోచనకు కారణం వైఎస్‌ రాజశేఖర్ రెడ్డేనని ఆ లేఖలో ప్రెసిడెంట్ అండ్ సీఈవో వివరించారు. వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2007లో హైదరాబాద్‌లో ఆయన్ను కలిసినట్టు లేఖలో వెల్లడించారు. అదో గొప్ప సమావేశంగా అభివర్ణించారు.

ఆ సమయంలో మీ కంపెనీ ఇండియాలో అటోమొబైల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తే అది తమ ఏపీలోనే చేయాలని వైఎస్ కోరారన్నారు. ఆ రోజే తాను కూడా ఆయనకు మాట ఇచ్చానన్నారు. ఒకవేళ ఇండియాలో తమ కంపెనీ ప్లాంట్ ఏర్పాటు చేస్తే మొదట ఏపీలోనే దాన్ని ఏర్పాటు చేస్తామని ఆరోజే వైఎస్‌కు మాట ఇచ్చానని… ఆ మాట ప్రకారమే తాము ఏపీలో ప్లాంట్ ఏర్పాటు చేసినట్టు కంపెనీ ప్రెసిడెంట్ అండ్ సీఈవో… జగన్‌కు రాసిన లేఖలో వివరించారని బుగ్గన చదివి వినిపించారు.

First Published:  15 July 2019 8:00 AM GMT
Next Story