రాజుగారి గది-3…. హీరోయిన్ దొరికేసింది

రాజుగారి గది-3 సినిమాపై మొన్నటివరకు ఓ రకమైన సస్పెన్స్ కొనసాగింది. తమన్న తప్పుకున్న తర్వాత ఆ స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారనే ఆసక్తి అందరిలో ఉండేది. ఇప్పుడు ఉత్కంఠకు తెరపడింది. రాజుగారి గది-3లో హీరోయిన్ ఫిక్స్ అయింది. అవికా గౌర్ ను తీసుకున్నారు. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నారు

తమన్నను కలిసి, ఆమెను ఒప్పించిన తర్వాతే రాజుగారి గది-3 సినిమాను ప్రారంభించారు. ఓపెనింగ్ కు కూడా తమన్న వచ్చింది. కానీ అంతలోనే ఓ చిన్న హిందీ సినిమా ఆఫర్ రావడంతో అక్కడికి వెళ్లిపోయింది. ఆ తర్వాత కాజల్ ను సంప్రదించారు. ఆమె కూడా ఒప్పుకోలేదు. తర్వాత తాప్సిని కలిశారు. ఆమె కూడా నో చెప్పింది. వాళ్లంతా నో చెప్పిన సబ్జెక్ట్ కు ఇప్పుడు అవికా గౌర్ ఎంపికైంది.

అవికాగౌర్ కు ప్రస్తుతం సినిమాల్లేవ్. ఎక్కడికి పోతావ్ చిన్నవాడా తర్వాత ఆమె తెలుగులో ఒక్క సినిమాకు కూడా కమిట్ అవ్వలేదు. ఇక దాదాపు ఆమె కెరీర్ క్లోజ్ అయిపోయిందనుకున్న టైమ్ కు రాజుగారి గది-3 ఆఫర్ వచ్చింది. ఈ సినిమా క్లిక్ అయితే, అవికాకు మరో 2-3 అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది. ఇది ఫెయిలైతే, ఇక ఆమె పూర్తిగా హిందీ టీవీ సీరియల్స్ చేసుకుంటుంది.