Telugu Global
NEWS

లోకల్ బాడీ ఎన్నికలపై బొత్స

ఏపీలో లోకల్ బాడీ ఎన్నికలకు మరింత సమయం పట్టవచ్చని మంత్రి బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు.  సెప్టెంబర్‌ తర్వాతే ఎన్నికలు ఉంటాయని వెల్లడించారు. మున్సిపాలిటీలకు ముందు నిర్వహించాలా? లేక ఎంపీటీసీ ఎన్నికలు తొలుత నిర్వహించాలా? అన్న దానిపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు బొత్స సత్యనారాయణ. ఏపీలో లోకల్ బాడీల కాలపరిమితి తీరి చాలా కాలమైంది. గత ప్రభుత్వం ఎన్నికల నిర్వాహణ వాయిదా వేస్తూ వచ్చింది. ఈనేపథ్యంలో కొత్త ప్రభుత్వం ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తుందన్న దానిపై చర్చ నడుస్తోంది. […]

లోకల్ బాడీ ఎన్నికలపై బొత్స
X

ఏపీలో లోకల్ బాడీ ఎన్నికలకు మరింత సమయం పట్టవచ్చని మంత్రి బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. సెప్టెంబర్‌ తర్వాతే ఎన్నికలు ఉంటాయని వెల్లడించారు.

మున్సిపాలిటీలకు ముందు నిర్వహించాలా? లేక ఎంపీటీసీ ఎన్నికలు తొలుత నిర్వహించాలా? అన్న దానిపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు బొత్స సత్యనారాయణ.

ఏపీలో లోకల్ బాడీల కాలపరిమితి తీరి చాలా కాలమైంది. గత ప్రభుత్వం ఎన్నికల నిర్వాహణ వాయిదా వేస్తూ వచ్చింది.

ఈనేపథ్యంలో కొత్త ప్రభుత్వం ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తుందన్న దానిపై చర్చ నడుస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటు అంశం కూడా ఈ ఎన్నికలతో ముడిపడి ఉండడంతో… ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఆసక్తిగా మారింది.

First Published:  15 July 2019 4:03 AM GMT
Next Story