ప్రో బాక్సింగ్ లో విజేందర్ మరో సూపర్ విన్

  • అమెరికా గడ్డపై విజేందర్ తొలిగెలుపు
  • ప్రో బాక్సర్ గా వరుసగా 11 విజయాలు

ప్రొఫెషనల్ బాక్సింగ్ లో భారత ఏకైక బాక్సర్ విజేందర్ సింగ్..తన విజయపరంపరను కొనసాగిస్తున్నాడు. ఇప్పటి వరకూ ఇంగ్లండ్, భారత్ వేదికలుగా ముగిసిన పోటీలలోనే విజేతగా నిలిచిన విజేందర్…అమెరికన్ ప్రో బాక్సింగ్ సర్క్యూట్ అరంగేట్రం ఫైట్ లో అదరగొట్టాడు.

నవార్క్ వేదికగా ముగిసిన ఫైట్ లో మైక్ స్నైడర్ పై నాలుగోరౌండ్లోనే టెక్నికల్ నాకౌట్ విజయం సాధించాడు. విజేందర్ ముష్ఠిఘాతాల పరంపరకు.. ప్రత్యర్థి స్నైడర్ ఏమాత్రం నిలువలేకపోయాడు.

ఒలింపిక్స్ లో భారత్ కు బాక్సింగ్ పతకాలు అందించిన విజేందర్ కొద్దిమాసాల క్రితమే ప్రొఫెషనల్ బాక్సింగ్ లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకూ తలపడిన 11 బౌట్లలోనూ విజేందర్ అజేయంగా నిలవడం విశేషం.

ప్రస్తుత సంవత్సరంలో మరో రెండు ఫైట్లలో పాల్గోనున్నట్లు విజేందర్ ప్రకటించాడు.