Telugu Global
NEWS

ఫార్ములావన్ లో హామిల్టన్ టాప్ గేర్

బ్రిటీష్ జీపీ ఆరోసారి గెలుచుకొన్న హామిల్టన్  టైటిల్ రేస్ లో హామిల్టన్ కు భారీ ఆధిక్యం 2019 ఫార్ములావన్ గ్రాండ్ ప్రీ సర్క్యూట్ లో…బ్రిటీష్ రేసర్, టీమ్ మెర్సిడెస్ స్టార్ డ్రైవర్ లూయి హామిల్టన్ ఆధిక్యం కొనసాగుతోంది. సిల్వర్ స్టోన్ రేస్ ట్రాక్ వేదికగా ముగిసిన బ్రిటీష్ గ్రాండ్ ప్రీ టైటిల్ ను సైతం హామిల్టన్ సొంతం చేసుకొన్నాడు. హోరాహోరీగా సాగిన రేస్ లో విజేతగా నిలిచాడు. టీమ్ మేట్ వాల్టెరీ బోట్టాస్ నుంచి గట్టిపోటీ ఎదుర్కొని […]

ఫార్ములావన్ లో హామిల్టన్ టాప్ గేర్
X
  • బ్రిటీష్ జీపీ ఆరోసారి గెలుచుకొన్న హామిల్టన్
  • టైటిల్ రేస్ లో హామిల్టన్ కు భారీ ఆధిక్యం

2019 ఫార్ములావన్ గ్రాండ్ ప్రీ సర్క్యూట్ లో…బ్రిటీష్ రేసర్, టీమ్ మెర్సిడెస్ స్టార్ డ్రైవర్ లూయి హామిల్టన్ ఆధిక్యం కొనసాగుతోంది.

సిల్వర్ స్టోన్ రేస్ ట్రాక్ వేదికగా ముగిసిన బ్రిటీష్ గ్రాండ్ ప్రీ టైటిల్ ను సైతం హామిల్టన్ సొంతం చేసుకొన్నాడు. హోరాహోరీగా సాగిన
రేస్ లో విజేతగా నిలిచాడు.

టీమ్ మేట్ వాల్టెరీ బోట్టాస్ నుంచి గట్టిపోటీ ఎదుర్కొని విన్నర్ గా నిలిచాడు. ఆరోసారి బ్రిటీష్ గ్రాండ్ ప్రీ విజేతగా నిలవడం ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

ఇప్పటికే ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ గా నిలిచిన హామిల్టన్ టైటిల్ రేస్ లో సమీప ప్రత్యర్థి బోట్టాస్ కంటే 39 పాయింట్లతో ముందంజలో ఉన్నాడు.

First Published:  15 July 2019 4:00 AM GMT
Next Story