Telugu Global
NEWS

ప్రపంచకప్ బెస్ట్ ప్లేయర్ గా కేన్ విలియమ్స్ సన్

ప్రపంచకప్ లో కెప్టెన్ గా అత్యధిక పరుగుల కివీ కెప్టెన్  టైటిల్ చేజారినా కేన్ విలియమ్స్ సన్ కు ఊరట ఇంగ్లండ్ వేదికగా ముగిసిన వన్డే ప్రపంచకప్ లో మూడో ర్యాంకర్ న్యూజిలాండ్ టైటిల్ చేజార్చుకొన్నా…. ప్లేయర్ ఆఫ్ ది ప్రపంచకప్ అవార్డును మాత్రం సొంతం చేసుకోగలిగింది. బ్యాట్స్ మన్ గా, కెప్టెన్ గా అత్యుత్తమంగా రాణించిన కివీ కెప్టెన్ కేన్ విలియమ్స్ సన్ కు ప్లేయర్ ఆఫ్ ది ప్రపంచకప్ అవార్డు దక్కింది. విలియమ్స్ సన్ మొత్తం […]

ప్రపంచకప్ బెస్ట్ ప్లేయర్ గా కేన్ విలియమ్స్ సన్
X
  • ప్రపంచకప్ లో కెప్టెన్ గా అత్యధిక పరుగుల కివీ కెప్టెన్
  • టైటిల్ చేజారినా కేన్ విలియమ్స్ సన్ కు ఊరట

ఇంగ్లండ్ వేదికగా ముగిసిన వన్డే ప్రపంచకప్ లో మూడో ర్యాంకర్ న్యూజిలాండ్ టైటిల్ చేజార్చుకొన్నా…. ప్లేయర్ ఆఫ్ ది ప్రపంచకప్ అవార్డును మాత్రం సొంతం చేసుకోగలిగింది.

బ్యాట్స్ మన్ గా, కెప్టెన్ గా అత్యుత్తమంగా రాణించిన కివీ కెప్టెన్ కేన్ విలియమ్స్ సన్ కు ప్లేయర్ ఆఫ్ ది ప్రపంచకప్ అవార్డు దక్కింది.

విలియమ్స్ సన్ మొత్తం 10 మ్యాచ్ లు ఆడి రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలతో సహా 578 పరుగులు సాధించాడు.

జయవర్థనే రికార్డు తెరమరుగు….

ప్రపంచకప్ సింగిల్ టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన కెప్టెన్ గా నిలిచిన శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్థనే పేరుతో గత 12 సంవత్సరాలుగా ఉన్న రికార్డును ప్రస్తుత ప్రపంచకప్ లో కివీ కెప్టెన్ కేన్ విలియమ్స్ సన్ అధిగమించాడు.

2007 ప్రపంచకప్ లో శ్రీలంక కెప్టెన్ గా మహేల జయవర్ధనే మొత్తం 548 పరుగులు సాధిస్తే…ప్రస్తుత ప్రపంచకప్ లో కేన్ విలియమ్స్ సన్ 578 పరుగులతో సరికొత్తరికార్డు నమోదు చేయటం విశేషం.

నాలుగేళ్ల క్రితం ముగిసిన 2015 ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పొందిన న్యూజిలాండ్ కు…2019 ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఓటమి తప్పలేదు.

First Published:  15 July 2019 3:52 AM GMT
Next Story