Telugu Global
NEWS

మీ పెంపుడు కుక్కను కంట్రోల్ చేయండి... లేదంటే ఎంపీగా రాజీనామా చేస్తా...

అధికారంలో ఉన్నప్పుడు కలిసి వ్యవహారాలు నడిపిన టీడీపీ నేతలు… ఇప్పుడు అధికారం పోగానే ఎవరి వ్యూహాలకు తగ్గట్లు వారు ట్విట్టర్ లో విన్యాసాలు మొదలుపెట్టారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని ఇదే పని మీద ఉన్నారు. చంద్రబాబుకు చీకాకు తెప్పించడం ఎలా అన్న ధోరణిలోనే వరుసగా ట్వీట్లు చేస్తూ వస్తున్నారు. మధ్యలో హఠాత్తుగా బుద్దా వెంకన్న పైనా నాని ట్వీట్ వార్ మొదలు పెట్టాడు. బుద్దా వెంకన్న నుంచి కూడా అదే స్థాయిలో రియాక్షన్ వచ్చింది. రాజకీయ జన్మలు, […]

మీ పెంపుడు కుక్కను కంట్రోల్ చేయండి... లేదంటే ఎంపీగా రాజీనామా చేస్తా...
X

అధికారంలో ఉన్నప్పుడు కలిసి వ్యవహారాలు నడిపిన టీడీపీ నేతలు… ఇప్పుడు అధికారం పోగానే ఎవరి వ్యూహాలకు తగ్గట్లు వారు ట్విట్టర్ లో విన్యాసాలు మొదలుపెట్టారు.

విజయవాడ ఎంపీ కేశినేని నాని ఇదే పని మీద ఉన్నారు. చంద్రబాబుకు చీకాకు తెప్పించడం ఎలా అన్న ధోరణిలోనే వరుసగా ట్వీట్లు చేస్తూ వస్తున్నారు.

మధ్యలో హఠాత్తుగా బుద్దా వెంకన్న పైనా నాని ట్వీట్ వార్ మొదలు పెట్టాడు. బుద్దా వెంకన్న నుంచి కూడా అదే స్థాయిలో రియాక్షన్ వచ్చింది.

దళిత మాజీ స్పీకర్ బాలయోగి ఆస్తులను కొట్టేసింది ఎవరు? అంటూ కేశినేని నాని బండారాన్ని బుద్దా బయటపెట్టారు. బుద్దాను ఉద్దేశించి కొబ్బరి చిప్పల దొంగ అంటూ కేశినేని కౌంటర్ ఇచ్చారు.

బుద్దా వెంకన్న నుంచి గట్టిగా ఎదురుదాడి ఉండడంతో కేశినేని నాని మరో అడుగు ముందుకేసి చంద్రబాబుకే అల్టిమేటం ఇచ్చారు.

నాలాంటి వ్యక్తి పార్టీకి అవసరం లేదనుకుంటే తాను ఎంపీ పదవికి కూడా రాజీనామా చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. నాలాంటి వారు పార్టీకి కావాలనుకుంటే మాత్రం మీ పెంపుడు కుక్కను కంట్రోల్ చేయండి అంటూ ట్వీట్ చేశారు కేశినేని నాని.

First Published:  14 July 2019 11:03 PM GMT
Next Story