Telugu Global
Cinema & Entertainment

మూడు కథలు... ముగ్గురు దర్శకులు... నాగ శౌర్య హీరో...

టాలీవుడ్ లోని ప్రముఖ దర్శకులలో కె.రాఘవేంద్రరావు ఒకరు. అయితే ఒకప్పుడు బ్లాక్ బస్టర్ చిత్రాలకు దర్శకత్వం వహించిన రాఘవేంద్రరావు గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. విశాఖపట్నం లో ఒక యాక్షన్ సన్నివేశం షూటింగ్ జరుగుతున్న సమయంలో నాగ శౌర్య గాయపడినప్పుడు రాఘవేంద్ర రావు నాగశౌర్య ఇంటికి వెళ్లి మరీ అతనిని పరామర్శించి వచ్చారు. అయితే తాజా సమాచారం ప్రకారం నాగశౌర్య హీరోగా రాఘవేంద్ర రావు ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారని వార్తలు […]

మూడు కథలు... ముగ్గురు దర్శకులు... నాగ శౌర్య హీరో...
X

టాలీవుడ్ లోని ప్రముఖ దర్శకులలో కె.రాఘవేంద్రరావు ఒకరు. అయితే ఒకప్పుడు బ్లాక్ బస్టర్ చిత్రాలకు దర్శకత్వం వహించిన రాఘవేంద్రరావు గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.

విశాఖపట్నం లో ఒక యాక్షన్ సన్నివేశం షూటింగ్ జరుగుతున్న సమయంలో నాగ శౌర్య గాయపడినప్పుడు రాఘవేంద్ర రావు నాగశౌర్య ఇంటికి వెళ్లి మరీ అతనిని పరామర్శించి వచ్చారు. అయితే తాజా సమాచారం ప్రకారం నాగశౌర్య హీరోగా రాఘవేంద్ర రావు ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే నాగశౌర్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాని రాఘవేంద్రరావు నిర్మిస్తారట. ఈ చిత్రానికి ముగ్గురు దర్శకులు పని చేయబోతున్నారట. అందులో ఒకరు క్రిష్ అని తెలుస్తోంది.

ఈ చిత్రం ఒక ప్రేమ కథ ని ఇందులో మూడు కథలు ఉండబోతున్నాయని, మూడింటికి ఈ మూడు విభిన్న దర్శకులు దర్శకత్వం వహించనున్నారని, కానీ మూడు కథలలో నాగశౌర్య హీరో గా కనిపిస్తాడని సన్నిహిత వర్గాల సమాచారం. అంతేకాకుండా సినిమాలో ముగ్గురు హీరోయిన్లు కూడా ఉండబోతున్నారట. నాగ శౌర్య కోలుకున్న తర్వాత సినిమా షూటింగ్ మొదలవుతుందని తెలుస్తోంది.

First Published:  15 July 2019 5:21 AM GMT
Next Story