Telugu Global
Cinema & Entertainment

మరోసారి కన్ ఫర్మ్ చేసిన నాగార్జున

మన్మథుడు సినిమా వాయిదా పడిందట. సాహోతో పోటీకి ఇష్టంలేక ఆ సినిమాను సెప్టెంబర్ కు వాయిదా వేశారట. దాదాపు వారం రోజులుగా మీడియాలో నలుగుతున్న టాపిక్ ఇది. ఎట్టకేలకు దీనిపై స్పష్టత వచ్చింది. స్వయంగా హీరో నాగార్జున ఈ మేటర్ పై రియాక్ట్ అయ్యాడు. చెప్పిన తేదీకే మన్మథుడు-2 సినిమా వస్తుందని నిర్థారించాడు. రీసెంట్ గా నాగ్ ట్వీట్ చేశాడు. ఇంతకుముందు చెప్పినట్టుగానే తమ సినిమా ఆగస్ట్ 9న థియేటర్లలోకి వచ్చి తీరుతుందని మరోసారి ఎనౌన్స్ చేశాడు. పనిలోపనిగా […]

మరోసారి కన్ ఫర్మ్ చేసిన నాగార్జున
X

మన్మథుడు సినిమా వాయిదా పడిందట. సాహోతో పోటీకి ఇష్టంలేక ఆ సినిమాను సెప్టెంబర్ కు వాయిదా వేశారట.
దాదాపు వారం రోజులుగా మీడియాలో నలుగుతున్న టాపిక్ ఇది. ఎట్టకేలకు దీనిపై స్పష్టత వచ్చింది. స్వయంగా హీరో నాగార్జున ఈ మేటర్ పై రియాక్ట్ అయ్యాడు. చెప్పిన తేదీకే మన్మథుడు-2 సినిమా వస్తుందని నిర్థారించాడు.

రీసెంట్ గా నాగ్ ట్వీట్ చేశాడు. ఇంతకుముందు చెప్పినట్టుగానే తమ సినిమా ఆగస్ట్ 9న థియేటర్లలోకి వచ్చి తీరుతుందని మరోసారి ఎనౌన్స్ చేశాడు. పనిలోపనిగా సినిమాకు సంబంధించి మరో కొత్త పోస్టర్ రిలీజ్ చేశాడు. ఆగస్ట్ 15న సాహో వస్తోంది. ఈ సినిమాకు సరిగ్గా వారం ముందు మన్మథుడు-2 వస్తోందన్నమాట. సాహోకు పోటీగా రావడం ఇష్టంలేక మన్మథుడు-2ను తప్పించారంటూ గాసిప్స్ వచ్చాయి. వీటిపై నాగ్ ఇలా క్లారిటీ ఇచ్చాడు.

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. సమంత, కీర్తిసురేష్ ప్రత్యేక పాత్రలు పోషించారు. సినిమాలో వయసు పెరిగినా పెళ్లికాని వ్యక్తి పాత్రలో నాగార్జున కనిపించనున్నాడు.

First Published:  15 July 2019 6:18 AM GMT
Next Story