Telugu Global
NEWS

పరిజ్ఞానం బయటపెట్టుకున్న లోకేష్‌

అసెంబ్లీలో వైసీపీదే పూర్తిగా పైచేయి. కానీ మండలిలో మాత్రం ఇప్పటికీ టీడీపీదే హవా నడుస్తోంది. మండలిలో టీడీపీ సభ్యులే అధికంగా ఉండడంతో నారా లోకేష్ ఏకపక్షంగా ప్రభుత్వంపై సుధీర్ఘంగా ఆరోపణలు చేస్తూ ప్రసంగించారు. రాష్ట్రంలో కోటీ 70 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని… కానీ గ్రామ సచివాలయాల ద్వారా కేవలం నాలుగు లక్షల మందికి మాత్రమే ఉద్యోగాలు ఇస్తున్నారని… మిగిలిన కోటీ 66 లక్షల మంది నిరుద్యోగుల పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించారు. కేవలం నాలుగు లక్షల మందికి […]

పరిజ్ఞానం బయటపెట్టుకున్న లోకేష్‌
X

అసెంబ్లీలో వైసీపీదే పూర్తిగా పైచేయి. కానీ మండలిలో మాత్రం ఇప్పటికీ టీడీపీదే హవా నడుస్తోంది. మండలిలో టీడీపీ సభ్యులే అధికంగా ఉండడంతో నారా లోకేష్ ఏకపక్షంగా ప్రభుత్వంపై సుధీర్ఘంగా ఆరోపణలు చేస్తూ ప్రసంగించారు.

రాష్ట్రంలో కోటీ 70 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని… కానీ గ్రామ సచివాలయాల ద్వారా కేవలం నాలుగు లక్షల మందికి మాత్రమే ఉద్యోగాలు ఇస్తున్నారని… మిగిలిన కోటీ 66 లక్షల మంది నిరుద్యోగుల పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించారు.

కేవలం నాలుగు లక్షల మందికి మాత్రమే గ్రామ సచివాలయాల ద్వారా ఉద్యోగాలు ఇచ్చి మిగిలిన కోటీ 66 లక్షల మందిని జగన్‌ గాలికి వదిలేస్తున్నారని చెప్పిన లోకేష్…. ఆ మరునిమిషానికే తన పరిజ్ఞానం బయటపెట్టారు.

టీడీపీ హయాంలో ఆరు లక్షల మంది నిరుద్యోగులకు నెలనెలా రెండు వేల చెప్పున నిరుద్యోగ భృతి ఇచ్చామని గొప్పగా చెప్పుకున్నారు.

ఇక్కడే ఎవరికైనా వచ్చే అనుమానం… రాష్ట్రంలో కోటీ 70 లక్షల మంది నిరుద్యోగులుంటే కేవలం నాలుగు లక్షల మందికి మాత్రమే జగన్ ఉద్యోగాలు ఇచ్చి… మిగిలిన కోటీ 66 లక్షల మందిని గాలికి వదిలేస్తున్నారని చెప్పిన నారా లోకేష్…. మరి టీడీపీ హయాంలో నిరుద్యోగ భృతి కేవలం ఆరు లక్షల మందికి ఎందుకిచ్చినట్టు? మిగిలిన కోటీ 64 లక్షల మంది నిరుద్యోగులకు భృతి ఎందుకు ఇవ్వలేదు? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

ఆరు లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇవ్వడం గొప్ప విషయమా? లేక నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడం గొప్ప విషయమా? అంటే…. ఎవరైనా లక్షల ఉద్యోగాలు ఇవ్వడమే గొప్ప అని చెబుతారు.

అదే సమయంలో రైతులు రుణాలు ఇప్పుడు తీసుకుంటారు కాబట్టి…. ఆ రుణాలకు వడ్డీని వచ్చే ఏడాది చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి…. వచ్చే బడ్జెట్‌లో సున్నా వడ్డీ పథకానికి భారీగా నిధులు ఇస్తామని ప్రభుత్వం వివరణ ఇచ్చినప్పటికీ లోకేష్ దాన్ని పట్టించుకోలేదు.

సున్నా వడ్డీ పథకానికి నాలుగు వేల కోట్లు అవసరమవుతుందన్న జగన్‌…. ఇప్పుడు వంద కోట్లు మాత్రమే ఎందుకు కేటాయించారు? అని ప్రశ్నించారు లోకేష్. ఇలా ప్రభుత్వ వివరణలతో, వాస్తవ పరిస్థితులతో సంబంధం లేకుండా కేవలం ప్రభుత్వాన్ని విమర్శించడమే లక్ష్యంగా లోకేష్ ప్రసంగం సాగింది.

First Published:  15 July 2019 9:40 AM GMT
Next Story