Telugu Global
Cinema & Entertainment

మళ్లీ పెళ్లి చేసుకున్న పూజా బాత్రా

90ల్లో కుర్రకారును ఉర్రూతలూగించిన పూజా బాత్రా మరోసారి వార్తల్లో వ్యక్తిగా మారింది. 42 ఏళ్ల ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మరోసారి పెళ్లి చేసుకుంది. ఆ విషయాన్ని ఆమె అధికారికంగా ప్రకటించింది. హిందీ నటుడు నవాబ్ షాతో ఢిల్లీలో తనకు వారం రోజుల కిందట పెళ్లయిన విషయాన్ని పూజా బాత్రా ధృవీకరించింది. పెళ్లయిన వెంటనే నవాబ్ షా, పూజా బాత్రా హనీమూన్ కు గోవా వెళ్లారు. ఆ స్టిల్స్ అన్నింటినీ ఎప్పటికప్పుడు నవాబ్ షా సోషల్ మీడియాలో అప్ […]

మళ్లీ పెళ్లి చేసుకున్న పూజా బాత్రా
X

90ల్లో కుర్రకారును ఉర్రూతలూగించిన పూజా బాత్రా మరోసారి వార్తల్లో వ్యక్తిగా మారింది. 42 ఏళ్ల ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మరోసారి పెళ్లి చేసుకుంది. ఆ విషయాన్ని ఆమె అధికారికంగా ప్రకటించింది. హిందీ నటుడు నవాబ్ షాతో ఢిల్లీలో తనకు వారం రోజుల కిందట పెళ్లయిన విషయాన్ని పూజా బాత్రా ధృవీకరించింది.

పెళ్లయిన వెంటనే నవాబ్ షా, పూజా బాత్రా హనీమూన్ కు గోవా వెళ్లారు. ఆ స్టిల్స్ అన్నింటినీ ఎప్పటికప్పుడు నవాబ్ షా సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్నాడు. ఈరోజు లేదా రేపు వీళ్లు తమ వివాహాన్ని అధికారికంగా రిజిస్టర్ చేయించుకోబోతున్నారు. కొన్నాళ్లు ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేసిన తర్వాత మళ్లీ సినిమాల్లోకి వస్తానని ప్రకటించింది పూజా బాత్రా.

తెలుగులో గ్రీకువీరుడు అనే సినిమలో నటించింది పూజా బాత్రా.

అప్పట్లో ఆమె స్టిల్స్ కు యూత్ కు విపరీతమైన క్రేజ్ ఉండేది. ప్రతి స్టూడెంట్ గదిలో ఆమె పోస్టర్లు కనిపించేవి. హాట్ గా ఉండే అమ్మాయిల్ని పూజా బాత్రాతో పోల్చేవారు అప్పట్లో. అంతగా ఓ తరాన్ని ప్రభావితం చేసిన పూజా బాత్రా.. దాదాపు దశాబ్దం పాటు అమెరికాలోనే ఉండిపోయింది.

అమెరికాకు చెందిన ఓ ఫిజియోథెరపిస్ట్ ను పెళ్లాడిన పూజా బాత్రా.. అతడితో 9 ఏళ్లు కాపురం చేసింది. 2011లో అతడి నుంచి విడిపోయింది. అయినప్పటికీ చాన్నాళ్లు అమెరికాలోనే ఉండిపోయింది. మూడేళ్ల కిందట ఇండియా వచ్చిన ఈ ముద్దుగుమ్మ.. నవాబ్ షాతో ప్రేమలో పడింది. 6 నెలల కిందటే ఒకరికొకరు పరిచయమైనా వీళ్లిద్దరూ తక్కువ టైమ్ లోనే కనెక్ట్ అయ్యారు. ఇప్పుడిలా పెళ్లితో ఒక్కటయ్యారు.

First Published:  15 July 2019 5:37 AM GMT
Next Story