Telugu Global
Cinema & Entertainment

తమిళం లో రానా 'జెర్సీ'

తెలుగు లో విడుదలయి నాని కెరీర్ లో ఒక గొప్ప చిత్రం గా నిలిచింది జెర్సీ. మళ్ళీ రావా అనే సినిమా తో అరంగేట్రం చేసిన గౌతమ్ ఈ జెర్సీ సినిమాకి దర్శకత్వం వహించాడు. శ్రద్ధ శ్రీనాథ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. సినిమా మొదటి నుంచి చివరి వరకు ఎంతో భావోద్వేగంగా సాగడం ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇకపోతే ఈ సినిమా ని సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించింది. ఆల్రెడీ […]

తమిళం లో రానా జెర్సీ
X

తెలుగు లో విడుదలయి నాని కెరీర్ లో ఒక గొప్ప చిత్రం గా నిలిచింది జెర్సీ. మళ్ళీ రావా అనే సినిమా తో అరంగేట్రం చేసిన గౌతమ్ ఈ జెర్సీ సినిమాకి దర్శకత్వం వహించాడు. శ్రద్ధ శ్రీనాథ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.

సినిమా మొదటి నుంచి చివరి వరకు ఎంతో భావోద్వేగంగా సాగడం ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇకపోతే ఈ సినిమా ని సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించింది.

ఆల్రెడీ హిందీ లో ఈ సినిమా రీమేక్ కి సంబంధించి టాక్ నడుస్తున్న విషయం మనకి తెలిసిందే. అంతే కాకుండా ఈ సినిమా ని ఇప్పుడు తమిళంలోకి కూడా రీమేక్ చేయనున్నారు.

నాని నటించిన ఈ సినిమా ని తమిళం లో రానా దగ్గుబాటి నిర్మిస్తున్నాడట. అయితే రానా నుండి ఇప్పటి వరకు ఈ విషయమై క్లారిటీ రాలేదు. విష్ణు విశాల్ ఈ సినిమా లో హీరో గా నటించనున్నాడట. తమిళ నాట ఒక పేరున్న దర్శకుడితో ఈ సినిమా ని చేయించనున్నారని టాక్ నడుస్తుంది. ఇక ఈ సినిమా పై పూర్తి వివరాలు త్వరలో వెలువడనున్నాయి.

First Published:  15 July 2019 4:56 AM GMT
Next Story