Telugu Global
NEWS

వింబుల్డన్ విజేత జోకోవిచ్

మారథాన్ ఫైనల్లో పోరాడి ఓడిన ఫెదరర్  4 గంటల 57 నిముషాలపాటు సాగిన థ్ర్లిల్లింగ్ ఫైనల్ 2019 వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ ను ప్రపంచ నంబర్ వన్, డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జోకోవిచ్ గెలుచుకొన్నాడు. లండన్ లోని ఆల్ ఇంగ్లండ్ క్లబ్ సెంటర్ కోర్టులో 4 గంటల 57నిముషాలపాటు..నువ్వానేనా అన్నట్లుగా సాగిన ఫైనల్లో టాప్ సీడ్ జోకోవిచ్ విజేతగా నిలిచాడు. వింబుల్డన్ కింగ్ రోజర్ ఫెదరర్ పై 7-6, 1-6, 7-6, 4-6, 13-12 తో […]

వింబుల్డన్ విజేత జోకోవిచ్
X
  • మారథాన్ ఫైనల్లో పోరాడి ఓడిన ఫెదరర్
  • 4 గంటల 57 నిముషాలపాటు సాగిన థ్ర్లిల్లింగ్ ఫైనల్

2019 వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ ను ప్రపంచ నంబర్ వన్, డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జోకోవిచ్ గెలుచుకొన్నాడు.

లండన్ లోని ఆల్ ఇంగ్లండ్ క్లబ్ సెంటర్ కోర్టులో 4 గంటల 57నిముషాలపాటు..నువ్వానేనా అన్నట్లుగా సాగిన ఫైనల్లో
టాప్ సీడ్ జోకోవిచ్ విజేతగా నిలిచాడు.

వింబుల్డన్ కింగ్ రోజర్ ఫెదరర్ పై 7-6, 1-6, 7-6, 4-6, 13-12 తో జోకోవిచ్ విజేతగా నిలిచాడు.వింబుల్డన్ చరిత్రలో అత్యధిక సుధీర్ఘంగా సాగిన రెండో ఫైనల్ మ్యాచ్ గా రికార్డుల్లో చేరింది.

జోకోవిచ్ వింబుల్డన్ టైటిల్ గెలుచుకోడం ఇది ఐదోసారి కాగా…ఎనిమిదిసార్లు విన్నర్ రోజర్ ఫెదరర్ రన్నరప్ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

విజేత జోకోవిచ్ కు వింబుల్డన్ ట్రోఫీతో పాటు 20 కోట్ల 50 లక్షల రూపాయల ప్రైజ్ మనీ దక్కింది.

37 ఏళ్ల లేటు వయసులో వింబుల్డన్ ఫైనల్ చేరడమే కాదు…రన్నరప్ గా నిలిచిన ఘనతను రోజర్ ఫెదరర్ దక్కించుకొన్నాడు.

First Published:  14 July 2019 8:20 PM GMT
Next Story