Telugu Global
NEWS

బ్యాక్‌ సీట్‌ పెంచేదేనా? ప్రజలకు ఏమైనా చేసేది ఉందా?

టీడీపీ ఎంపీ కేశినేని నాని చేస్తున్న ట్విట్టర్ వార్‌ చాలా మందికి అప్పుడే బోర్ కొట్టిస్తోంది. తనకు తాను టీడీపీ నుంచి పోకుండా… గెంటివేయించుకుని వెళ్లాలన్నది నాని ఆలోచనగా ఉందని అనుమానిస్తున్నారు. అయితే గెంటే సాహసం బాబు చేయలేకపోతున్నారు. ఒక అడుగు ముందుకేసిన కేశినేని నాని… మీ పెంపుడు కుక్కని కంట్రోల్ చేస్తారా లేక ఎంపీ పదవికి రాజీనామా చేయమంటారా? అని చంద్రబాబును ప్రశ్నించారు. కేశినేనినాని దృష్టిలో చంద్రబాబు పెంపుడు కుక్క అంటే బుద్దా వెంకన్న. ఇలా […]

బ్యాక్‌ సీట్‌ పెంచేదేనా? ప్రజలకు ఏమైనా చేసేది ఉందా?
X

టీడీపీ ఎంపీ కేశినేని నాని చేస్తున్న ట్విట్టర్ వార్‌ చాలా మందికి అప్పుడే బోర్ కొట్టిస్తోంది. తనకు తాను టీడీపీ నుంచి పోకుండా… గెంటివేయించుకుని వెళ్లాలన్నది నాని ఆలోచనగా ఉందని అనుమానిస్తున్నారు.

అయితే గెంటే సాహసం బాబు చేయలేకపోతున్నారు. ఒక అడుగు ముందుకేసిన కేశినేని నాని… మీ పెంపుడు కుక్కని కంట్రోల్ చేస్తారా లేక ఎంపీ పదవికి రాజీనామా చేయమంటారా? అని చంద్రబాబును ప్రశ్నించారు. కేశినేనినాని దృష్టిలో చంద్రబాబు పెంపుడు కుక్క అంటే బుద్దా వెంకన్న.

ఇలా టీడీపీ నేతలు ట్విట్టర్లో ఒకరి రంగు మరొకరు బయటపెట్టుకుంటున్న నేపథ్యంలో విజయవాడ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పీవీపీ స్పందించారు. ట్విట్టర్లో ఘాటు వ్యాఖ్యలు చేశారు. చట్టసభల్లో కూర్చుని బ్యాక్‌ సీట్‌ పెంచడం కాదు… మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలకు ఏమైనా చేసేది ఉందా? అని ప్రశ్నించారు. లేక ట్విట్టర్‌లో కూర్చుని కాలక్షేపం చేస్తారా? అని ప్రశ్నించారు. కేశినేని నాని, బుద్దా వెంకన్న పరస్పరం చేసుకుంటున్న ఆరోపణలతో మాత్రం ప్రజలంతా ఏకీభవిస్తున్నారని పీవీపీ వ్యాఖ్యానించారు.

First Published:  15 July 2019 3:53 AM GMT
Next Story