Telugu Global
Cinema & Entertainment

బిగ్ బాస్ సీజన్ " 3.... వాయిదా పడనుందా?

తెలుగులో బిగ్గెస్ట్ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ మూడవ సీజన్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. అయితే బిగ్ బాస్ సీజన్ 1,2 లతో పోలిస్తే ఇంకా విడుదల కాకముందే వివాదాలకు తెర తీస్తోంది సీజన్ 3. ఈ నేపథ్యంలో అసలు బిగ్ బాస్ మొదలవుతుందా లేక వాయిదా పడుతుందా? అనే సందేహాలు కూడా వెల్లువెత్తుతున్నాయి. దీనికి కారణం ఇద్దరు మహిళలు చేసిన కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు. ఇంకో రెండు వారాల్లో బిగ్ […]

బిగ్ బాస్ సీజన్  3.... వాయిదా పడనుందా?
X

తెలుగులో బిగ్గెస్ట్ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ మూడవ సీజన్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. అయితే బిగ్ బాస్ సీజన్ 1,2 లతో పోలిస్తే ఇంకా విడుదల కాకముందే వివాదాలకు తెర తీస్తోంది సీజన్ 3.

ఈ నేపథ్యంలో అసలు బిగ్ బాస్ మొదలవుతుందా లేక వాయిదా పడుతుందా? అనే సందేహాలు కూడా వెల్లువెత్తుతున్నాయి. దీనికి కారణం ఇద్దరు మహిళలు చేసిన కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు.

ఇంకో రెండు వారాల్లో బిగ్ బాస్ సీజన్-3 ప్రారంభమవుతుందనుకున్న సమయంలో యాంకర్ శ్వేతారెడ్డి బిగ్ బాస్ షో నిర్వాహకులపై సంచలన వ్యాఖ్యలు చేసింది.

వారు…. ఇంప్రెస్ చేస్తేనే బిగ్ బాస్ లోకి వెళ్లే అవకాశం తనకు ఇస్తామని చెప్పారన్న శ్వేతారెడ్డి… అది బిగ్ బాస్ హౌస్ కాదు బ్రోతల్ హౌస్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.

మరో వైపు నటి గాయత్రి గుప్త కూడా రఘు, రవికాంత్ అనే వ్యక్తులపై ఆరోపణలు చేసింది. తనతో అసభ్యకరంగా ప్రవర్తించారని వారిపై ఫిర్యాదు చేసింది. అగ్రిమెంట్ పై సైన్ చేశాక…. బిగ్ బాస్ వారు అసభ్యంగా ప్రవర్తించారని… తమను ఎలా సుఖ పెడతారు అని వారు అడిగారని…. ఫిర్యాదులో తెలిపింది.

ఈ నేపథ్యంలో బిగ్ బాస్ సీజన్ ఆటంకం లేకుండా మొదలవుతుందా లేక వాయిదా పడుతుందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

First Published:  15 July 2019 11:49 PM GMT
Next Story