Telugu Global
Cinema & Entertainment

లండన్ లో సుకుమార్... ఏం చేస్తున్నాడంటే....

ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఈ మధ్యనే ‘రంగస్థలం’ సినిమా తో బ్లాక్ బస్టర్ ను అందుకున్నారు. రామ్ చరణ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా తర్వాత సుకుమార్ తదుపరి సినిమా ఎలా ఉండబోతోంది అని ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంతకు ముందు సుకుమార్ మహేష్ బాబు తో ఒక సినిమా చేయాల్సి ఉంది… కానీ ఆ సినిమా నుంచి […]

లండన్ లో సుకుమార్... ఏం చేస్తున్నాడంటే....
X

ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఈ మధ్యనే ‘రంగస్థలం’ సినిమా తో బ్లాక్ బస్టర్ ను అందుకున్నారు. రామ్ చరణ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులను క్రియేట్ చేసింది.

ఇక ఈ సినిమా తర్వాత సుకుమార్ తదుపరి సినిమా ఎలా ఉండబోతోంది అని ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంతకు ముందు సుకుమార్ మహేష్ బాబు తో ఒక సినిమా చేయాల్సి ఉంది… కానీ ఆ సినిమా నుంచి మహేష్ బాబు తప్పుకున్నట్లు తెలిసిందే. ఆ సినిమా తర్వాత సుకుమార్ బన్నీ తో ఒక సినిమా చేయబోతున్నట్లు ప్రకటన బయటకు వచ్చింది. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో బిజీగా ఉన్న అల్లు అర్జున్… ఆ సినిమాని ఈ ఏడాది ఆఖర్లో పూర్తి చేయనున్నారు.

ఈ సినిమా తర్వాత సుకుమార్ సినిమా ని బన్నీ సెట్స్ పైకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇదిలా ఉండగా రంగస్థలం సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన రత్నవేలు ని తన తదుపరి సినిమా కోసం కూడా తీసుకోవాలని సుకుమార్ అనుకున్నారు.

కానీ తాజాగా రత్నవేలు మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకి సైన్ చేశారు. కాబట్టి ఈ సినిమా పూర్తయ్యేదాకా సుకుమార్ సినిమా కోసం రత్నవేలు పని చేయలేరు. అయితే సుకుమార్ మాత్రం తన తదుపరి సినిమా గురించి ఏం ఆలోచించకుండా… తన భార్య పిల్లలతో పాటు వరల్డ్ కప్ చూడటానికి లండన్ వెళ్లారు. అక్కడే రెండు వారాల పాటు గడిపి తర్వాత ఇండియాకి తిరిగి రానున్నారు.

First Published:  15 July 2019 11:06 PM GMT
Next Story