ఇస్మార్ట్… ‘చార్మి’ వితండవాదం

అంతా ఊహించినట్టే జరిగింది. ఇస్మార్ట్ శంకర్ ట్రయిలర్ చూసిన వెంటనే సెన్సార్ కష్టాలు తప్పవని అంతా భావించారు. ఇప్పుడదే జరిగింది. ఇస్మార్ట్ శంకర్ సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. ఎప్పుడూ జరిగినట్టే ఈసారి కూడా పూరి సినిమాకు మ్యూట్ లు, బ్లర్ లు తప్పలేదు. వీటితో పాటు కొన్ని కటింగ్స్ కూడా సూచించి, సినిమాకు ఎ-సర్టిఫికేట్ ఇచ్చారు సెన్సారోళ్లు.

పూరి జగన్నాధ్ సినిమాలకు ఎ-సర్టిఫికేట్ కొత్త కాదు. ఇంకా చెప్పాలంటే ‘A’ కాకుండా మరో సర్టిఫికేట్ వస్తేనే కాస్త ఆశ్చర్యపోవాలి. అయితే ఇలా ఎ-సర్టిఫికేట్ రావడం కూడా గొప్పగా ఫీల్ అవుతోంది యూనిట్. చార్మి అయితే ఓ అడుగు ముందుకేసి ఏకంగా ట్వీట్ కూడా పెట్టేసింది.

దేశముదురు, పోకిరి, బిజినెస్ మేన్ ఇలా పూరి తీసిన సినిమాలన్నీ ఎ-సర్టిఫికేట్ మూవీసే. అవన్నీ థియేటర్లలో బ్రహ్మాండంగా ఆడాయి. సో.. ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ కు కూడా ఎ-సర్టిఫికేట్ ఇచ్చారు కాబట్టి ఇది కూడా కచ్చితంగా ఆడుతుందనే అర్థం వచ్చేలా ట్వీటింది చార్మి.

సెన్సార్ టాక్ ప్రకారం.. ఇస్మార్ట్ శంకర్ లో వయెలెన్స్ తో పాటు రొమాన్స్ పాళ్లు కూడా కాస్త ఎక్కువగా ఉన్నాయట. అంతేకాదు… కొంతమంది ఊహించినట్టు సినిమా ప్రీ-క్లయిమాక్స్ లో మంచి ట్విస్ట్ ఉన్నట్టు తెలుస్తోంది. గురువారం థియేటర్లలోకి వస్తోంది ఇస్మార్ట్ శంకర్.