రాఘవేంద్రరావు సినిమాకి…. దర్శకులు వీళ్లే

గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఇప్పుడు నిర్మాతగా మారబోతున్నారు. రాఘవేంద్ర ఒక సినిమాని నిర్మించబోతున్నారని, ఈ సినిమా లో నాగశౌర్య హీరోగా నటించబోతున్నాడు అని ఇప్పటికే వార్తలు బయటకు వచ్చాయి.

అయితే ఈ సినిమాలో మూడు కథలు ఉంటాయని, ఒక్కో కథకి ఒక్కొక్కరు దర్శకత్వం వహించబోతున్నారని సమాచారం. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ముగ్గురు దర్శకులలో ఒకరు క్రిష్ అని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. మరొక రెండు కథల కోసం రాఘవేంద్రరావు మరొక ప్రముఖ దర్శకుడి ని రంగంలోకి దింపారని తెలుస్తోంది. ఆ దర్శకుడు ఎవరో కాదు ప్రకాష్ కోవెలమూడి. స్వయానా రాఘవేంద్రరావు తనయుడైన ప్రకాష్ కోవెలమూడి… తెలుగులో ఒకటి రెండు సినిమాలకు దర్శకత్వం వహించినప్పటికీ మంచి విజయాన్ని సాధించలేకపోయారు.

గత కొంత కాలంగా బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ప్రకాష్ దర్శకత్వం వహించిన ‘మెంటల్ హై క్యా’ సినిమా త్వరలో విడుదల కాబోతోంది.

ఇక రాఘవేంద్ర రావు నిర్మిస్తున్న సినిమాలో మూడు కథలలో ఒకదానికి క్రిష్ దర్శకత్వం వహిస్తుండగా మిగతా రెండిటికి ప్రకాష్ దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది.