“ఎవరో చెప్పుకోండి చూద్దాం..!”….

‘హార్ట్ ఎటాక్’ సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైన అదా శర్మ ఎప్పటినుంచో మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది.

ఈ మధ్య పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్రలను కూడా ఎంచుకుంటూ ముందుకెళ్తున్న అదా శర్మ తాజాగా సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ వల్ల ఇప్పుడు వార్తల్లోకి ఎక్కింది.

తాజాగా అదా శర్మ తన బేబీ బంప్ తో ఫొటోకి ఫోజు ఇచ్చి అందరినీ షాక్ కు గురి చేసింది. “ఎవరో చెప్పుకోండి చూద్దాం..!!” అనే క్యాప్షన్ తో ఈ ఫొటోని పోస్ట్ చేసింది అదా శర్మ.

ఆ ఫొటో లో ఎత్తు పళ్ళతో చీరకట్టులో పిజ్జా తింటూ కనిపిస్తుంది అదా శర్మ. ఇప్పటిదాకా గ్లామరస్ పాత్రలో కనిపించిన ఆదా శర్మ…. ఇప్పుడు సడన్ గా ఇలా నాన్ గ్లామరస్ అవతారం ఎత్తడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మధ్యనే ‘కల్కి’ అనే సినిమాలో రాజశేఖర్ తో రొమాన్స్ చేసిన అదాశర్మ ఇప్పుడు బాలీవుడ్ లో ఒక సినిమా చేస్తోందట. మరోవైపు రెండు తమిళ సినిమాలతో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న అదా శర్మ ఇంకా తెలుగులో ఏ సినిమా సైన్ చేయలేదు.