Telugu Global
NEWS

ఫేస్‌బుక్ పరిచయం.... వివాహితపై అత్యాచారం

సామాజిక మాధ్యమాల వల్ల ఎంత మంచి ఉందో.. అంతకు మించిన చెడు కూడా జరుగుతోంది. అపరిచితులతో పరిచయాలు ఆపదల్లోకి నెడుతుంటాయి. మన బలహీనతలను ఎదుటి వ్యక్తి సొమ్ము చేసుకుంటాడని ఎన్నో ఘటనలు రుజువు చేస్తున్నాయి. టైం పాస్ కోసం మొదలు పెట్టే సామాజిక మాధ్యమ పరిచయాలు కొందరి జీవితాలను సర్వనాశనం చేస్తుంటాయి. అలాంటి ఘటనే అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా రాయదుర్గానికి చెందిన ఒక వ్యక్తికి నాలుగేళ్ల క్రితం కర్ణాటకకు చెందిన యువతితో వివాహం […]

ఫేస్‌బుక్ పరిచయం.... వివాహితపై అత్యాచారం
X

సామాజిక మాధ్యమాల వల్ల ఎంత మంచి ఉందో.. అంతకు మించిన చెడు కూడా జరుగుతోంది. అపరిచితులతో పరిచయాలు ఆపదల్లోకి నెడుతుంటాయి. మన బలహీనతలను ఎదుటి వ్యక్తి సొమ్ము చేసుకుంటాడని ఎన్నో ఘటనలు రుజువు చేస్తున్నాయి. టైం పాస్ కోసం మొదలు పెట్టే సామాజిక మాధ్యమ పరిచయాలు కొందరి జీవితాలను సర్వనాశనం చేస్తుంటాయి. అలాంటి ఘటనే అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది.

అనంతపురం జిల్లా రాయదుర్గానికి చెందిన ఒక వ్యక్తికి నాలుగేళ్ల క్రితం కర్ణాటకకు చెందిన యువతితో వివాహం అయ్యింది. రాయదుర్గంలోని ఒక ప్రాంతంలో వీరు కాపురం పెట్టారు. వీరికి 3 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే గత కొన్ని నెలలుగా ఈమెకు ఇంటి సమీపంలోని పాల షాప్ నిర్వహించే మహేష్ అనే యువకుడితో పరిచయం అయ్యింది. ఆ పరిచయం మరింత సన్నిహితంగా మారింది.

ఈ క్రమంలో సదరు వివాహిత సెల్‌ఫోన్‌లో ఫేస్‌బుక్ అకౌంట్ ఓపెన్ చేసింది. అందులో మహేష్‌తో పాటు అదే రాయదుర్గానికి చెందిన పవన్, చీటీ మల్లిఖార్జున్, ఫారూఖ్‌ల నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్స్ వచ్చాయి. వారితో అప్పుడప్పుడు చాటింగ్ చేయడం ఆ వివాహితకు అలవాటుగా మారింది. ఈ క్రమంలో ఆ ముగ్గురు స్నేహితులు ఒత్తిడి చేసి ఆమె సెల్ నెంబర్ సంపాదించారు. ఆ తర్వత ప్రతీ రోజు కాల్స్ చేయడం మొదలు పెట్టారు.

ఫేస్‌బుక్ చాటింగ్, సెల్ ఫోన్ కాల్స్ ద్వారా ఆమె వ్యక్తిగత, కుటుంబ విషయాలు తెలుసుకున్నారు. ఇక అప్పటి నుంచి ముగ్గురు ఆ వివాహితను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించారు. మాతో చాట్ చేస్తున్నావని, మాట్లాడుతున్నావని నీ భర్తకు, అత్తకు చెబుతాం అని తమ కోరిక తీర్చాలని వేధించడం మొదలు పెట్టారు. వీరు నలుగురు ఒకరికి తెలియకుండా మరొకరు వివాహితతో మాట్లాడి బెదిరించే వారు.

తమ కోరిక తీర్చకపోతే భర్తను, కుమారుడిని చంపుతామని కూడా బెదిరించారు. వారి బ్లాక్ మెయిలింగ్‌కు వివాహిత తలొగ్గింది. ఇలా ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశారు. బయటకు చెబితే యాసిడ్ దాడి చేస్తామని.. మీ సామాజిక వర్గం వారికి చెబుతామని బెదిరిస్తూ ఈ అత్యాచార పర్వం కొనసాగించారు.

కాగా రానురానూ వీరి ఆగడాలను భరించలేక.. వారి కోరిక తీర్చలేక సోమవారం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. అప్పుడు అసలు విషయం బయటకు రావడంతో పోలీసులకు పిర్యాదు చేశారు.

వివాహితను బెదిరించి అత్యాచారం చేసిన మహేష్, చీటీ మల్లిఖార్జున్, పవన్, షారుఖ్‌లపై 376, 370, 354, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ నలుగురిని అదుపులోనికి తీసుకొని విచారిస్తున్నారు.

First Published:  17 July 2019 12:04 AM GMT
Next Story