బుద్దా వెంకన్న టార్గెట్‌గా ప్రబుద్దుడు అంటూ…. నాని మరో ట్వీట్

ఏపీలో ప్రస్తుతం ఏం నడుస్తోంది అంటే.. నానీ ట్వీట్లు నడుస్తున్నాయని చెప్పుకుంటున్నారు. రాజకీయ వర్గాల్లో.. ముఖ్యంగా టీడీపీలో ఈ ట్వీట్ల వార్ చికాకు తెచ్చిపెడుతోంది. గత కొన్ని రోజులుగా విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని ట్వీట్ల యుద్దం చేస్తూ నారా లోకేష్, చంద్రబాబులను కూడా టార్గెట్ చేశారు.

ఈ ట్వీట్లకు కౌంటర్‌గా బుద్దా వెంకన్న కూడా రిప్లైలు ఇవ్వడం మొదలు పెట్టాడు. చివరికి వీరిద్దరి మధ్య ట్వీట్లు తెలుగుదేశం పార్టీకి మైనస్‌గా మారుతుండటంతో అధిష్టానం వారించింది. దీంతో బుద్దా వెంకన్న ట్వీట్లు చేయడం ఆపేశాడు. కాగా, నాని మాత్రం తన ట్వీట్లు కొనసాగిస్తూనే ఉన్నారు. అప్పట్లో బుద్దా వెంకన్న చేసిన ట్వీట్లనే మళ్లీ గుర్తు చేస్తూ కౌంటర్లు విసురుతున్నారు.

ఈ నెల 14న బుద్దా వెంకన్న ఒక ట్వీట్‌లో నాని ఫైనాన్షియర్లకు డబ్బులు ఎగ్గొట్టారని పేర్కొన్నాడు.

దీనికి సమాధానంగా బుద్దా వెంకన్నను ప్రబుద్దుడుగా సంబోధిస్తూ తాజాగా బుధవారం కూడా నాని ఒక ట్వీట్ చేశారు.

‘‘ప్రబుద్ధుడు చెప్పింది అక్షర సత్యం. ఫైనాన్షియర్లకి డబ్బులు ఎగ్గొట్టి వ్యాపారం చేసినా.. కేశినేని ట్రావెల్స్ మూసుకునే పరిస్థితి వచ్చేది కాదు. ఆస్తులు అమ్ముకునే దుస్థితి వచ్చేది కాదు. దొంగకి ఊరందరూ దొంగలుగానే కనపడతారు’’ అని కేశినేని నాని ట్వీట్ చేశారు. మరి దీనిపై అధిష్టానం, వెంకన్న ఎలా స్పందిస్తారో చూడాల్సిందే.