ఫ్యాన్స్ ఫైర్… నిర్వహకులకు విజయ్ హెచ్చరిక

విజయ్ దేవరకొండ ప్రస్తుతం డియర్ కామ్రేడ్ కి సంబందించిన ప్రమోషన్స్ లో బిజీ గా ఉన్నాడు. అయితే ఈ సినిమా కి సంబంధించి మ్యూజిక్ ఫెస్టివల్స్ అనే ఈవెంట్స్ లో భాగం గా బెంగళూరు, కొచ్చి, హైదరాబాద్ మరియు చెన్నై నగరాల్లో ఈవెంట్స్ ను ప్లాన్ చేశాడు విజయ్. ఇప్పటికే బెంగళూరు లో మరియు కొచ్చి లో ఈవెంట్స్ ముగిశాయి.

అయితే విజయ్ దేవరకొండ వచ్చాడని…. కొచ్చి లో అభిమానులు భారీ ఎత్తున విజయ్ ని చూడటానికి… విజయ్ ఉంటున్న హోటల్ కి చేరుకున్నారు. పోలీసులు కూడా ఇది వూహించకపోడంతో, వాళ్ళని కంట్రోల్ చేయడం కష్టమైంది. ఈ నేపథ్యం లో పోలీసులు లాఠీ ఛార్జ్ చేసినట్లు తెలుస్తోంది.

అభిమానులు హర్ట్ అయ్యి, విజయ్ మీద కోపం తో అక్కడే ధర్నాకి దిగారు. అయితే విషయం తెలుసుకున్న విజయ్ వెంటనే తన అభిమానులని చూడటానికి హోటల్ బయటకి వచ్చి అభిమానులని చూసి ఉద్వేగానికి లోనయ్యాడు.

ఇలాంటి సంఘటనలు చెన్నై మరియు హైదరాబాద్ లో జరగకూడదు అనే ఉదేశ్యం తో నిర్వాహకులకు ముందు గా నే హెచ్చరించాడట విజయ్.