Telugu Global
NEWS

అలా అయితేనే టీడీపీలో ఉంటా.... గంటా డిమాండ్

టీడీపీ నేతల ఐదేళ్ల అధికార దాహం తీరడం లేదు. అధికారం లేకుండా ఉండలేకపోతున్నారు. అందుకే టీడీపీ ఓడిపోయి నెల తిరగకుండానే నలుగురు రాజ్యసభ సభ్యులు అధికార బీజేపీలో చేరిపోయారు. ఇక గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలలో చాలామంది పక్కచూపులు చూస్తున్నారు. అయితే టీడీపీలో సీనియర్ నేత, ప్రతీసారి పార్టీ మారుతూ మంత్రిగా అధికారం చెలాయిస్తున్న గంటాకు ఈసారి మాత్రం ఆ కోరిక నెరవేరలేదు. ఎమ్మెల్యేగా గెలిచినా అధికారం మాత్రం దక్కలేదు. టీడీపీ ఓడిపోవడంతో ఇప్పుడు ఆయన ప్రతిపక్షంలో […]

అలా అయితేనే టీడీపీలో ఉంటా.... గంటా డిమాండ్
X

టీడీపీ నేతల ఐదేళ్ల అధికార దాహం తీరడం లేదు. అధికారం లేకుండా ఉండలేకపోతున్నారు. అందుకే టీడీపీ ఓడిపోయి నెల తిరగకుండానే నలుగురు రాజ్యసభ సభ్యులు అధికార బీజేపీలో చేరిపోయారు. ఇక గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలలో చాలామంది పక్కచూపులు చూస్తున్నారు.

అయితే టీడీపీలో సీనియర్ నేత, ప్రతీసారి పార్టీ మారుతూ మంత్రిగా అధికారం చెలాయిస్తున్న గంటాకు ఈసారి మాత్రం ఆ కోరిక నెరవేరలేదు. ఎమ్మెల్యేగా గెలిచినా అధికారం మాత్రం దక్కలేదు. టీడీపీ ఓడిపోవడంతో ఇప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు.

అయితే టీడీపీ ఎమ్మెల్యేలందరినీ బీజేపీలోకి తీసుకొని వెళ్లేందుకు గంటా చర్చలు జరిపాడన్న వార్తలు పెద్ద ఎత్తున వచ్చాయి. దీనిపై ఆయన వివరణ ఇచ్చుకున్నా ఆ ఆరోపణలు తగ్గలేదు.

తాజాగా టీడీపీలో సైలెంట్ గా ఉన్న గంటా కొత్త డిమాండ్ ను తెరపైకి తీసుకువచ్చారని టీడీపీలో చర్చ జరుగుతోందట. గంటా పెట్టిన అల్టిమేటం ఇప్పుడు టీడీపీలో కలకలం రేపుతోందట.

తాను టీడీపీలో కొనసాగాలంటే తనకు కేబినెట్ ర్యాంకు ఉన్న, ప్రతిపక్షానికి ఇచ్చే ఒకే ఒక్క పదవి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వాలని అడుగుతున్నాడట గంటా. గంటా కోరిక చంద్రబాబుకు షాక్ లా మారిందట.

ఉత్తరాంధ్రలో గంటాకు చాలా పట్టు ఉంది. విశాఖ సహా ఉత్తరాంధ్రలో క్యాడర్ బలముంది. గంటా పోతే టీడీపీకి నష్టమే. అలాంటి గంటా ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షానికి ఇచ్చే ఒకే ఒక్క కేబినెట్ పదవిని అడగడం చంద్రబాబుకు షాకింగ్ లా మారింది. ఇస్తేనే పార్టీలో ఉంటానని…. లేదంటే వీడుతానని ఆయన చెబుతున్నట్టు పార్టీలో చర్చ జరుగుతోంది.

First Published:  17 July 2019 5:13 AM GMT
Next Story