‘గుణ 369’…. రొమాంటిక్, యాక్షన్‌… థియేట్రికల్ ట్రైలర్

‘ఆర్ ఎక్స్ 100’ సినిమాతో మంచి విజయాన్ని సాధించిన యువహీరో కార్తికేయ ‘హిప్పీ’ సినిమాతో మాత్రం డిజాస్టర్ అందుకున్నాడు. ఇప్పుడు కొత్త దర్శకుడు అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో ‘గుణ 369’ అనే సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు కార్తికేయ.

అనాఘ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా టీజర్ తోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. దర్శక నిర్మాతలు ఇవాళ ట్రైలర్ ని విడుదల చేశారు.

“మన అనుకున్న వాళ్ళు బాగుండాలంటే ప్రపంచంలో ప్రమాదాలు ఏ రూపంలో వస్తాయో చెప్పాలిరా గుణ” అనే ఆసక్తికరమైన డైలాగ్ తో మొదలైన ఈ థియేట్రికల్ ట్రైలర్ లో కార్తికేయ సరికొత్త లుక్ తో కనిపించబోతున్నాడు.

అంతే కాకుండా థియేట్రికల్ ట్రైలర్ చూస్తే… సినిమాలో హీరో హీరోయిన్ ల మధ్య కెమిస్ట్రీ కూడా చాలా బాగా వర్క్ ఔట్ అయిందని, కార్తికేయ రొమాంటిక్ సన్నివేశాల్లో కూడా నటించాడని తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ ట్రైలర్…. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంటోంది. ఎస్ జి మూవీ మేకర్స్ పతాకంపై తిరుమలరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి ‘ఆర్ ఎక్స్ 100’ ఫేమ్ చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. మరి ఈ సినిమాతో అయినా కార్తికేయ హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.