ఇస్మార్ట్ శంకర్ అసలు కథ ఇదే

సినిమాలో తెలంగాణ డైలాగ్స్ ఉన్నాయి.. మసాలా సాంగ్స్ ఉన్నాయి.. అందాల ముద్దుగుమ్మలున్నారు. కానీ అసలు కథేంటి అనే విషయం ఇప్పటివరకు బయటకురాలేదు. సరిగ్గా విడుదలకు కొన్ని గంటల ముందు ఇస్మార్ట్ శంకర్ స్టోరీలైన్ బయటకొచ్చింది. ఇందులో రామ్, ఇద్దరు వ్యక్తులుగా…. కనిపిస్తాడు.

ఫస్టాఫ్ లో పాతబస్తీ కుర్రాడిలా కనిపిస్తాడు రామ్. ఆ క్యారెక్టర్ మొత్తం నభా నటేష్ చుట్టూ తిరుగుతుంది. ఇక సెకండాఫ్ కు వచ్చేసరికి మాత్రం రామ్ బ్రెయిన్ లో ఓ చిప్ పెడతారు. అది సత్యదేవ్ కు సంబంధించిన మెమొరీస్ తో కూడిన చిప్ అన్నమాట. నిధి అగర్వాల్ ఆ చిప్ ను రామ్ కు అమరుస్తుంది.

ఇక అక్కడ్నించి సత్యదేవ్ ఆలోచనలు, అతడి గత జ్ఞాపకాలన్నీ రామ్ లోకి వచ్చేస్తాయి. అలా రామ్ రూపంలో ఉన్న సత్యదేవ్ విలన్లను చంపడం కోసం కాశీకి వెళతాడు. అసలు సత్యదేవ్ మెమొరీని రామ్ కు ఎందుకు ఎక్కించారనేది సినిమాలో ట్విస్ట్.

ఇస్మార్ట్ శంకర్ సినిమా మొత్తం ఈ లైన్ చుట్టూనే తిరుగుతుంది. దీని చుట్టూ పంచ్ డైలాగ్ లు, మసాలా సీన్లు అద్దారు. పూరి జగన్నాధ్ డైరక్ట్ చేసిన ఈ సినిమాకు సెన్సార్ అధికారులు A-సర్టిఫికేట్ ఇచ్చారు. సినిమా నిడివి 2 గంటల 20 నిమిషాల 20 సెకెన్లు ఉంది. రేపు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది ఇస్మార్ట్ శంకర్ సినిమా.