మహేష్, రమేష్ కు నో…. నరేష్ తోనే ఉంటానంటున్న కృష్ణ

సూపర్ స్టార్ కృష్ణ మరియు విజయనిర్మల అన్యోన్య దాంపత్యం గురించి తెలిసిందే. అయితే విజయనిర్మల మృతి కృష్ణ కి తీరని లోటు అని చెప్పుకోవచ్చు.

తాజా సమాచారం ప్రకారం విజయనిర్మల చనిపోయిన తర్వాత మహేష్ బాబు మరియు రమేష్ బాబు ఇద్దరూ కలిసి తమ తండ్రిని ఇల్లు మారితే మనసు కుదుట పడుతుందని నచ్చచెప్పడానికి ప్రయత్నించారట.

కానీ కృష్ణ అవేమీ పట్టించుకోలేదని…. తనకు విజయనిర్మలతో ఉన్న ఇంట్లోనే జ్ఞాపకాలు ఉన్నాయని… కాబట్టి ఆ ఇంటిని వదిలే ప్రసక్తే లేదని కృష్ణ చెప్పినట్లు సమాచారం.

చాలాకాలంగా కృష్ణ నరేష్ తో పాటే ఉంటున్నారు. కానీ కేవలం విజయనిర్మల చనిపోయినందువల్ల తాను నరేష్ ని వదిలి రాలేనని తన నిర్ణయాన్ని చెప్పారట.

మహేష్ బాబు, రమేష్ బాబు కూడా తండ్రి నిర్ణయాన్నికి గౌరవం ఇచ్చి…. ఈ విషయంలో బలవంతం చేయలేదని తెలుస్తోంది.

ఇకపోతే కుటుంబ సభ్యులు మాత్రం కృష్ణ ఒంటరిగా ఫీలవకుండా ఎప్పటికప్పుడు కలుస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు నరేష్ కూడా కృష్ణ నిర్ణయానికి చాలా సంతోషించారని సమాచారం.