మోడీని మంత్రులు లైట్ తీసుకుంటున్నారా?

కేంద్రంలో రెండోసారి గద్దెనెక్కిన బీజేపీలో నేతల ఉదాసీనత, దుందుడుకు స్వభావం ఇప్పుడు బాగా పెరిగిపోయిందన్న సంగతి అర్థమవుతోంది. బీజేపీ నేతలు రెచ్చిపోయి అధికారులపై దాడులు చేస్తుండడం చూశాక అదే అనిపిస్తోంది.

బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేల తీరుపై అధిష్టానం గుర్రుగా ఉందట.. తాజాగా దేశప్రధాని మోడీ కూడా ఈ విషయంలో కేంద్రమంత్రులు, ఎంపీలపై ఆగ్రహం వ్యక్తం చేయడం పరిస్థితికి అద్ధం పడుతోంది.

తాజాగా బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కేంద్రమంత్రులపై మోడీ ఆగ్రహం వ్యక్తం చేశాడట.. కొత్త మంత్రుల పనితీరు ఏమాత్రం బాగా లేదని అసహనం వ్యక్తం చేశాడట.. సుమారు రెండు నెలలు కావస్తున్నా మంత్రులు తమ శాఖల పనితీరును ఒంటబట్టించుకోకపోవడం.. శాఖలపై పట్టు సాధించకపోవడంపై వారు ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం.

కనీసం పార్లమెంట్ సమావేశాలకు హాజరు కాకపోవడం.. ఇక ప్రశ్నలకు తడబడడంపై మోడీ సీరియస్ అయినట్టు సమాచారం. ఇలానే ఉంటే మిమ్ముల్ని తొలగించి వేరే వారిని తీసుకుంటామని స్పష్టం చేశారట.

ఇలా మోడీ మాటనే లైట్ తీసుకుంటున్న కేంద్ర మంత్రుల వ్యవహారశైలి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.