Telugu Global
National

ముంబైలో కూలిన పాత భవనం.... పెరిగిన మృతుల సంఖ్య

దేశ ఆర్థిక రాజధాని ముంబాయిలో దారుణం జరిగింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఓ పాత భవనం కుప్పకూలి పోయింది. ఈ దారుణ సంఘటనలో 14 మంది శిథిలాల కింద పడి మృత్యువాత పడ్డారు. ఇంకా అనేక మంది శిథిలాల కింద ఉన్నారని అనుమానిస్తున్నారు. శిథిలాల కింద ఉన్న వారిలో ఎంతమంది ప్రాణాలతో ఉన్నారో అంచనా వేయలేమని అధికారులు చెబుతున్నారు. గడచిన పది రోజులుగా ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే పాత […]

ముంబైలో కూలిన పాత భవనం.... పెరిగిన మృతుల సంఖ్య
X

దేశ ఆర్థిక రాజధాని ముంబాయిలో దారుణం జరిగింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఓ పాత భవనం కుప్పకూలి పోయింది. ఈ దారుణ సంఘటనలో 14 మంది శిథిలాల కింద పడి మృత్యువాత పడ్డారు. ఇంకా అనేక మంది శిథిలాల కింద ఉన్నారని అనుమానిస్తున్నారు. శిథిలాల కింద ఉన్న వారిలో ఎంతమంది ప్రాణాలతో ఉన్నారో అంచనా వేయలేమని అధికారులు చెబుతున్నారు.

గడచిన పది రోజులుగా ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే పాత భవనాలు, పాఠశాలలు కుప్పకూలుతున్నాయి. ముంబైలోని డోంగీర ప్రాంతంలో ఉన్నఈ కేదార్ భాయ్ భవనం మంగళవారం కుప్పకూలింది. ఈ భవనంలోవ్యాపార సంస్థలతో పాటు పది నుంచి పదిహేను కుటుంబాల వరకు నివసిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు.

నాలుగు అంతస్తులు ఉన్న ఈ భవనం వంద సంవత్సరాల క్రితం నిర్మించారని, భవనాన్ని కూల్చి తిరిగి నిర్మిస్తామని యజమానులు చెప్పడం వల్ల దీని కూల్చివేతకు ఆదేశాలు ఇవ్వలేదని అధికారులు చెబుతున్నారు. అయితే స్థానికుల వాదన మాత్రం మరో విధంగా ఉంది. భవనాన్ని కూల్చి తిరిగి నిర్మించే ఉద్దేశ్యం యజమానులకు లేదని, పాత భవనం ఎన్నాళ్లైనా గట్టిగానే ఉంటుందని వారు చెప్పేవారని స్ధానికులు అంటున్నారు.

భవనం కూలిన ప్రాంతం ఇరుకైనది కావడం వల్ల సహాయక చర్యలు చేపట్టడం ఇబ్బందిగా మారిందని ముంబై కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు. అంబులెన్సులు కానీ, శిథిలాలను తొలగించే యంత్రాలు కానీ సంఘటనా స్థలానికి చేరుకొలేకపోయానని అధికారులు వెల్లడించారు.

ఈ సంఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తన సానుభూతిని వ్యక్తం చేశారు. సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. పాత భవనం కూలి 14 మంది మరణించిన సంఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విచారాన్ని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నట్లు గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్లో పేర్కొన్నారు.

First Published:  16 July 2019 11:48 PM GMT
Next Story