షూటింగ్ వాయిదా పడింది…. కారణం నాని నేనట!

వరుస డిజాస్టర్ లతో సతమతమైన నాచురల్ స్టార్ నాని ఈ మధ్యనే ‘జెర్సీ’ సినిమాతో ఎట్టకేలకు మంచి హిట్ ను అందుకున్నాడు.

ఇక తాజాగా ‘గ్యాంగ్ లీడర్’ అనే మరొక ఆసక్తికరమైన సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నాని. తన డెబ్యూ సినిమా ‘అష్టా చమ్మ’ కి దర్శకత్వం వహించిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ‘వి’ సినిమాలో విలన్ పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో నివేదాథామస్ మరియు అదితి రావు హైదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం ఇప్పటికే కొన్ని సన్నివేశాల షూటింగ్ పూర్తయిందట. అయితే సుధీర్ బాబు పాత్రకి కావలసిన ఎలివేషన్ కంటే ఎక్కువగా వస్తోందని అనుకున్న నాని…. ఇంద్రగంటి మోహనకృష్ణ తో స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేయమని సూచించాడట.

పైగా అసలే ఇది నాని కెరీర్లో 25వ సినిమా అవడంతో ఈ సినిమా విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలోని ఒక షెడ్యూల్ గచ్చిబౌలి లో జరగాల్సి ఉంది…. కానీ నాని స్క్రిప్టులో మార్పులు చెప్పటం వల్ల ఈ షూటింగ్ ఇప్పుడు వాయిదా పడింది.