సాహో కాదు…. శర్వానంద్, అడవి శేష్ మధ్య పోటీ

ఆగస్ట్ 15 అంటే సాహో సినిమా గుర్తొస్తుంది ఎవరికైనా. సాహో రిలీజ్ అనగానే ఆగస్ట్ 15 గుర్తొస్తుంది. కానీ ఇప్పుడా తేదీ నుంచి సాహో సినిమా తప్పుకుంది. అవును.. గ్రాఫిక్స్ వర్క్ ఇంకా పెండింగ్ లో ఉండడం వల్ల సాహో సినిమాను వాయిదావేశారు. ఆ మేటర్ ఇంకా అఫీషియల్ గా బయటకురాలేదు. అయితే అంతలోనే 2 సినిమాలు ఆగస్ట్ 15ను ఆక్రమించాయి.

సాహో నుంచి అధికారిక ప్రకటన రాకముందే.. అడవి శేష్, శర్వానంద్ పంద్రాగస్ట్ పై కన్నేశారు. సాహో ఇలా పోస్ట్ పోన్ అయిందంటూ వార్త వచ్చిన వెంటనే.. ఆగస్ట్ 15 రిలీజ్ అంటూ వీళ్లిద్దరూ తమ కొత్త సినిమాల పోస్టర్లు రిలీజ్ చేశారు. అవును.. మొన్నటివరకు తెరపైకి రాని ‘ఎవరు’ సినిమాను సడెన్ గా ఆగస్ట్ 15న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించాడు అడవి శేష్. పీవీపీ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాలో రెజీనా హీరోయిన్.

#Ranarangam ?15th August, 2019

Posted by Sharwanand on Tuesday, 16 July 2019

అటు శర్వానంద్ కూడా అదే తేదీని ప్రకటించాడు. ఇన్నాళ్లూ ఓ మంచి డేట్ కోసం ఎదురుచూసిన ఈ హీరో, తన కొత్త మూవీ ‘రణరంగం’.. ఆగస్ట్ 15న వస్తుందని పోస్టర్ రిలీజ్ చేశాడు. ఇలా సాహో తప్పుకోవడంతో.. పోటీ శేష్, శర్వానంద్ మధ్యకు మారింది.