Telugu Global
NEWS

అధికారి తీరుపై సీఎం వద్ద మంత్రుల ఆవేదన

టీడీపీ 23 సీట్లకు పరిమితం అయినా … చంద్రబాబు హయాంలో కీలక స్థానాల్లో పాగావేసి ఇప్పటికీ చక్రం తిప్పుతున్న అధికారులు మాత్రం తమ వైఖరి మార్చుకోలేదు. చంద్రబాబు మీద అభిమానాన్ని చంపుకునేందుకు వారు సిద్ధపడడం లేదు. కొత్త ప్రభుత్వం వచ్చినా సరే ఇప్పటికీ కీలక స్థానాల్లోనే కూర్చుని బాబుకు బహిరంగంగా బాకా ఊదుతున్నారు. వారు ఏకంగా మంత్రులనే తప్పుదోవ పట్టిస్తున్నారు. చంద్రబాబు పాలనలో అంతా బాగుంది అని మంత్రుల చేత చెప్పిస్తున్నారంటే వారి ప్రభావం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రితో […]

అధికారి తీరుపై సీఎం వద్ద మంత్రుల ఆవేదన
X

టీడీపీ 23 సీట్లకు పరిమితం అయినా … చంద్రబాబు హయాంలో కీలక స్థానాల్లో పాగావేసి ఇప్పటికీ చక్రం తిప్పుతున్న అధికారులు మాత్రం తమ వైఖరి మార్చుకోలేదు. చంద్రబాబు మీద అభిమానాన్ని చంపుకునేందుకు వారు సిద్ధపడడం లేదు.

కొత్త ప్రభుత్వం వచ్చినా సరే ఇప్పటికీ కీలక స్థానాల్లోనే కూర్చుని బాబుకు బహిరంగంగా బాకా ఊదుతున్నారు. వారు ఏకంగా మంత్రులనే తప్పుదోవ పట్టిస్తున్నారు. చంద్రబాబు పాలనలో అంతా బాగుంది అని మంత్రుల చేత చెప్పిస్తున్నారంటే వారి ప్రభావం అర్థం చేసుకోవచ్చు.

ముఖ్యమంత్రితో జరిగిన మంత్రుల సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. కొందరు మంత్రులు… అధికారులు తమను తప్పుదోవ పట్టిస్తున్నారని సీఎంకు వివరించారు.

చంద్రబాబు హయాంలో కీలక శాఖలో కార్యదర్శిగా పనిచేసిన ఒక అధికారి ఇప్పటికీ చంద్రబాబు వీరాభిమానిలా పనిచేస్తున్నారని మంత్రులు వివరించారు. అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం తరపున తప్పుల తడకగా, వాస్తవాలను దాచేలా సదరు అధికారి సమాధానాలను సిద్ధం చేస్తున్నారని సీఎంకు వివరించారు.

చంద్రబాబు హయాంలో అంతా సాపీగానే, సక్రమంగానే సాగిందన్న అర్థం వచ్చేలా అసెంబ్లీలో ప్రశ్నలకు సదరు అధికారి సమాధానాలు సిద్ధం చేసి ఇస్తున్నారని అభిప్రాయపడ్డారు.

ఇలాంటి వారిని కీలక స్థానాల్లో కొనసాగిస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదని ముఖ్యమంత్రికి వివరించారు. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న ముఖ్యమంత్రి… ఇలాంటి అధికారులు కొందరు ఉంటారని… వారి పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.

వారు ఇచ్చే సమాచారంపై ఒకటికి రెండుసార్లు పరిశీలన చేసుకోవాలని… సీనియర్ నేతల దృష్టికి తీసుకెళ్లాలని… అవసరమైతే తాను కూడా సదరు సమాచారాన్ని పరిశీలిస్తానని జగన్ మోహన్ రెడ్డి మంత్రులకు వివరించారు. అంతా సక్రమంగా ఉందని నిర్ధారించుకున్న తర్వాతే సభలో ఆ సమాచారాన్ని వెల్లడించాలని ముఖ్యమంత్రి సూచించారు.

First Published:  16 July 2019 11:05 PM GMT
Next Story