Telugu Global
NEWS

ఆఫ్రికాకప్ ఫుట్ బాల్ లో నైజీరియాకు మూడోస్థానం

ట్యునీసియాపై 1-0తో నైజీరియా విజయం అల్జీరియాతో సెనెగల్ టైటిల్ సమరం ఈజిప్టు వేదికగా గత రెండువారాలుగా సాగుతున్న 32వ ఆఫ్రికాకప్ ఫుట్ బాల్ చాంపియన్షిప్ టోర్నీ ముగింపు దశకు చేరింది. ఆఫ్రికాఖండంలోని మొత్తం 24 దేశాల జట్లు తలపడుతున్న ఈ గ్రూపు లీగ్ కమ్ నాకౌట్ టోర్నీలో…నైజీరియా మూడో స్థానం దక్కించుకొంది. సెమీస్ లో అల్జీరియా, సెనెగల్… ఆఫ్రికాకప్ సాకర్ సెమీఫైనల్స్ లో అల్జీరియా, సెనెగల్ జట్లు విజయం సాధించడం ద్వారా టైటిల్ సమరానికి అర్హత సంపాదించాయి. […]

ఆఫ్రికాకప్ ఫుట్ బాల్ లో నైజీరియాకు మూడోస్థానం
X
  • ట్యునీసియాపై 1-0తో నైజీరియా విజయం
  • అల్జీరియాతో సెనెగల్ టైటిల్ సమరం

ఈజిప్టు వేదికగా గత రెండువారాలుగా సాగుతున్న 32వ ఆఫ్రికాకప్ ఫుట్ బాల్ చాంపియన్షిప్ టోర్నీ ముగింపు దశకు చేరింది.
ఆఫ్రికాఖండంలోని మొత్తం 24 దేశాల జట్లు తలపడుతున్న ఈ గ్రూపు లీగ్ కమ్ నాకౌట్ టోర్నీలో…నైజీరియా మూడో స్థానం దక్కించుకొంది.

సెమీస్ లో అల్జీరియా, సెనెగల్…

ఆఫ్రికాకప్ సాకర్ సెమీఫైనల్స్ లో అల్జీరియా, సెనెగల్ జట్లు విజయం సాధించడం ద్వారా టైటిల్ సమరానికి అర్హత సంపాదించాయి.

కైరోలోని అల్ సలామ్ స్టేడియం వేదికగా జరిగిన సెమీఫైనల్స్ లో అల్జీరియా 2-1 గోల్స్ తో నైజీరియాను, సెనెగల్ 1-0తో ట్యునీసియాను అధిగమించి టైటిల్ సమరానికి అర్హత సంపాదించాయి.

నైజీరియాకు కాంస్యం…

మూడో స్థానం కోసం జరిగిన హోరాహోరీ సమరంలో…నైజీరియా 1-0తో ట్యునీసియాను కంగు తినిపించింది.లీగ్ దశ నుంచి క్వార్టర్ ఫైనల్స్ వరకూ సంచలన విజయాలు సాధించిన ట్యునీసియా సెమీస్ లో తేలిపోయింది.

కాంస్యపతకం కోసం జరిగిన పోటీలో…నైజీరియా ఆటగాడు ఓడియన్ ఇగాలో ఆట ప్రారంభమైన కొద్ది నిముషాలలోనే సూపర్ గోల్ సాధించాడు.

ఆ తర్వాత ఈక్వలైజర్ కోసం ట్యునీసియా ఎంతగా పోరాడినా…నైజీరియా రక్షణ వలయాన్ని చేదించలేకపోయింది. కాంస్య పతకం పోటీలో గోల్ సాధించిన ఇగాలో గోల్డెన్ బూట్ అవార్డు గెలుచుకొనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుత టోర్నీలో ఇగాలోకు ఇది 5వ గోల్ కావడం విశేషం.

First Published:  18 July 2019 6:10 AM GMT
Next Story