కొడుకుకు… తండ్రి సలహా

సౌత్ స్టార్ చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ ఇప్పుడు ఇండస్ట్రీకి హీరోగా పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. తెలుగు లో బ్లాక్ బస్టర్ అయిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా తమిళ్ రీమేక్ అయిన ‘ఆదిత్య వర్మ’ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు ధృవ్.

అంతకుముందు ఈ సినిమా షూటింగ్ మొదటి కట్ పూర్తయ్యాక నిర్మాతలు ఆ షూటింగ్ పార్ట్ ని క్యాన్సిల్ చేసి కొత్తగా మళ్లీ ఈ సినిమా మొత్తం రీషూట్ చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేసింది ఈ చిత్ర బృందం. ఈ మధ్యనే విడుదలైన టీజర్ కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంది. ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్దమవుతోంది.

తాజాగా షూటింగ్ లో జరిగిన ఒక సరదా సంఘటన గురించి బయట పెట్టారు విక్రమ్. విక్రమ్ ఒక రోజు మామూలుగా సినిమా షూటింగ్ సెట్ కి మరియు డబ్బింగ్ స్టూడియో కి వెళ్లారట.

అయితే తన తండ్రి ముందు నటించటానికి సిగ్గు పడిన ధృవ్, విక్రమ్ అక్కడ ఉంటే తాను నటించనని డబ్బింగ్ కూడా చెప్పనని అన్నాడట.

ఇక విక్రమ్ స్వయంగా ధృవ్ వద్దకు వెళ్ళి తనని తన తండ్రిగా కాకుండా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా మాత్రమే చూడమని కేవలం వర్క్ పైన మాత్రమే దృష్టి పెట్టమని సలహా ఇచ్చారట. దీంతో మళ్లీ ధృవ్ మామూలుగా నటించాడట.