Telugu Global
National

కర్ణాటక సంక్షోభం.... వాయిదా వేసిన స్పీకర్

గత కొన్ని వారాలుగా కర్ణాటకలో సీఎం కుమారస్వామి సంకీర్ణ ప్రభుత్వం పూర్తి సంక్షోభంలో మునిగిపోయింది. కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడం.. తర్వాత రాజీనామా చేసినా స్పీకర్ ఆమోదించకపోవడంతో వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. అయితే సుప్రీంకోర్టు బుధవారం రోజు విశ్వాస తీర్మానం పెట్టాలని ఆదేశించింది. కాగా…. తమ సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు సీఎం కుమారస్వామి, కాంగ్రెస్ నేత సిద్దరామయ్య వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఉదయం కుమారస్వామి విశ్వాస తీర్మానాన్ని మొదలు పెట్టి చర్చను ప్రారంభించారు. అయితే ఎంత సేపటికీ రెబల్ […]

కర్ణాటక సంక్షోభం.... వాయిదా వేసిన స్పీకర్
X

గత కొన్ని వారాలుగా కర్ణాటకలో సీఎం కుమారస్వామి సంకీర్ణ ప్రభుత్వం పూర్తి సంక్షోభంలో మునిగిపోయింది. కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడం.. తర్వాత రాజీనామా చేసినా స్పీకర్ ఆమోదించకపోవడంతో వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. అయితే సుప్రీంకోర్టు బుధవారం రోజు విశ్వాస తీర్మానం పెట్టాలని ఆదేశించింది.

కాగా…. తమ సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు సీఎం కుమారస్వామి, కాంగ్రెస్ నేత సిద్దరామయ్య వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఉదయం కుమారస్వామి విశ్వాస తీర్మానాన్ని మొదలు పెట్టి చర్చను ప్రారంభించారు. అయితే ఎంత సేపటికీ రెబల్ ఎమ్మెల్యేలపై చర్చను కొనసాగించారు తప్ప ఓటింగ్ మాత్రం చేపట్టలేదు.

దీంతో బీజేపీ ఎమ్మెల్యేలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. విశ్వాస తీర్మానాన్ని వెంటనే ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై బీజేపీ సభ్యులతో పాటు కొందరు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. శాసన సభ్యుల గందరగోళంతో పలుమార్లు సభ వాయిదా పడింది.

చివరకు అసెంబ్లీని స్పీకర్ రమేష్ రేపటికి వాయిదా వేశారు. సభ వాయిదాపై బీజేపీ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఆ పార్టీ నేత యడ్యూరప్ప స్పీకర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సభలోనే ఉంటామని.. రేపటి వరకు ఇక్కడి నుంచి బయటకు రామని అక్కడే కూర్చున్నారు.

ఇక కుమారస్వామి ప్రభుత్వం విశ్వాస తీర్మానం నెగ్గుతుందో లేదో రేపటి సభలో తేలనుంది.

First Published:  18 July 2019 10:43 AM GMT
Next Story