బిగ్ బాస్ కి….  ఓయూ స్టూడెంట్స్ వార్నింగ్

బిగ్ బాస్ మూడవ సీజన్ కోసం టీవీ ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే బిగ్ బాస్ సీజన్ 3 కి నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్నారని అధికారిక ప్రకటన మరియు ప్రోమో కూడా విడుదల అయ్యాయి.

ఈ కార్యక్రమాన్ని జులై 21 నుంచి మొదలు పెడదామని కూడా నిర్ణయించుకున్నారు.

కానీ తాజాగా ప్రముఖ యాంకర్ శ్వేతా రెడ్డి మరియు నటి గాయత్రీ గుప్తా బిగ్ బాస్ నిర్వాహకులపై చేసిన క్యాస్టింగ్ కౌచ్ కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిర్మాత కేతి రెడ్డి బిగ్ బాస్ పై హైకోర్టులో కేసు వేశారు.

బిగ్ బాస్ వల్ల యువతలో సాంస్కృతిక వ్యతిరేకత ఏర్పడుతుందని, అలాగే బిగ్ బాస్ ప్రేక్షకులకు తప్పుడు మెసేజ్ లు ఇస్తుందంటూ… కేతి రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఒకవైపు ఈ కేస్… మరోవైపు కాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో పాటు ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని ఆపేయాలని, నాగార్జున ని కూడా ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవాలని వార్నింగ్ ఇస్తున్నారు.

అయితే ఇప్పటికే కొందరు నాగార్జున మరియు స్టార్ మా వారికి తమ వ్యతిరేకతను ఇతర మార్గాల ద్వారా తెలియజేస్తున్నారని సమాచారం. అయితే బిగ్ బాస్-3 విషయమై నిర్వాహకులు ఇంకా ఒక నిర్ణయానికి రావాల్సి ఉంది.